Ys Sharmila: తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ సంచలనం కల్గిస్తోంది. త్వరలో పార్టీ ప్రకటన వెలువడనుంది. ఖమ్మం బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. మరి ఖమ్మం తరువాత షర్మిల ఫోకస్ పెట్టనున్న మరో జిల్లా ఏంటనేది ఆసక్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ( Ys Sharmila new political party) పెట్టబోతున్నారు. త్వరలో పార్టీ ప్రకటన వెలువడనుంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో జరిగి భారీ బహిరంగ సభ( Khammam public meeting) షర్మిల కొత్త రాజకీయ పార్టీకు వేదిక కానుంది. ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలు, విద్యార్ధులతో సమావేశమవుతూ సంచలనం కల్గిస్తున్నారు. తెలంగాణ (Telangana)లోని వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమయ్యారు. కొత్త పార్టీ ఎలా ఉండబోతుందనేదానిపై చర్చించారు. పార్టీ స్థాపనకు ముందే ఆమెతో కలిసి నడిచేందుకు చాలామంది నేతలు ముందుకొస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రధానంగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టారు. అందుకే పార్టీ ప్రకటనకు కూడా ఖమ్మం జిల్లానే ఎంచుకున్నారు. 


అయితే ఖమ్మం జిల్లా తరువాత వైఎస్ షర్మిల (Ys Sharmila)ఏ జిల్లాపై దృష్టి పెడుతున్నారనేది ఆసక్తిగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాపై దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. ఈ జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే కాకుండా ఖమ్మం జిల్లా తరువాత వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండటం కూడా కారణంగా తెలుస్తోంది.  రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడమే కాకుండా ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని రాజకీయంగా బలహీనపర్చడం కూడా వ్యూహంలో భాగమని సమాచారం. మహబూబ్ నగర్‌తో పాటు నల్లొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై దృష్టి పెట్టవచ్చు.


Also read: Telangana Budget 2021 Highlights: తెలంగాణ బడ్జెట్ 2021 లైవ్ అప్‌డేట్స్, ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook