Congress-Ysrtp Merger: వైఎస్సార్ తెలంగాణ పార్టీ భవితవ్యం త్వరలో ఖరారు కానుంది. షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందనే వార్తలు చాలాకాలంగా విన్పిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన షర్మిల త్వరలో కీలక నిర్ణయం ప్రకటించనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ రాష్ట్రంలో చురుగ్గా ఉంటారనేది ఆసక్తిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ పార్టీల విలీన ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వైఎస్ షర్మిల ఇటీవలే ఢిల్లీలో సమావేశమయ్యారు. కొన్ని కీలకమైన అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే షర్మిల సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన పార్టీతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకు పునర్‌వైభవం రావాలంటే వైఎస్ షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణలోనే వైఎస్ షర్మిల పోటీ చేసినా ఏపీలో ప్రచారం కోసం వినియోగించుకోవచ్చని  సమాచారం. 


కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం చేస్తే తనకు లభించే ప్రాధాన్యత విషయంలో షర్మిల స్పష్టత కోరుకుంటున్నారు. వైఎస్ షర్మిల అయితే పాలేరు నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తోంది. అయితే అదే స్థానం నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకే వైఎస్ షర్మిలకు సికింద్రాబాద్ టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం. 


ఒకవేళ సికింద్రాబాద్‌పై ఆసక్తి లేకపోతే జంట నగరాల్లో ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోమని సూచించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం షర్మిల సేవల్ని ఏపీలో ఉపయోగించుకోవాలని యోచిస్తుంటే..షర్మిలకు మాత్రం ఏపీపై ఆసక్తి లేనట్టే తెలుస్తోంది. ఒకప్పుడు దక్షిణాది కాంగ్రెస్ పార్టీకు కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతోంది. తిరిగి కాంగ్రెస్ పార్టీకు జవజీవాలు రావాలంటే వైఎస్ షర్మిలతో సాధ్యమని ఆ పార్టీ నమ్మతోంది. అందుకే వారం రోజుల్లోనే షర్మిల పార్టీ విలీన ప్రక్రియ కొలిక్కి రావచ్చని సమాచారం. 


Also read: MLA Etela Rajender: నీ అబ్బ జాగీరా కేసీఆర్..? ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook