Ys Sharmila: చరిత్రలో జరగనివిధంగా ఖమ్మం సభ ఉండాలంటున్న వైఎస్ షర్మిల
Ys Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. చరిత్రలో కనీవినీ లేని విధంగా సభ ఉండాలని వైఎష్ షర్మిల భావిస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటన అత్యంత వైభవంగా ఉండాలంటున్నారు.
Ys Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. చరిత్రలో కనీవినీ లేని విధంగా సభ ఉండాలని వైఎష్ షర్మిల భావిస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటన అత్యంత వైభవంగా ఉండాలంటున్నారు.
దేశంలో అందరి దృష్టీ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వైపే కాదు..తెలంగాణ( Telangana)లో వైఎస్ షర్మిల(Ys Sharmila) నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ, పార్టీ ప్రకటనపై కూడా ఉంది. తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ దిశగా అడుగులేస్తున్న వైఎస్ షర్మిల( Ys sharmila new political party) ఇప్పటికే వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు, వ్యక్తిగత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో దీనికి సంబంధించి భారీ బహిరంస సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు హైదరాబాద్ లోటస్ పాండ్ కార్యాలయంలో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఖమ్మం సభ జరగాలన్నారు. సభకు భారీగా జన సమీకరణ ఉండాలని, ఆ దిశగా వ్యూహరచన చేయాలని ఖమ్మం పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ఖమ్మం సభ వేదికపైనే పార్టీ విధి విధానాల్ని ప్రకటిస్తామన్నారు.
ఖమ్మం సభ ( khammam public meeting) ఏర్పాట్ల కోసం ఇప్పటికే కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది. కేవలం రాజన్న సంక్షేమ పాలన కోసమే తాను వస్తున్నానని షర్మిల తెలిపారు. తెలంగాణలో దొరల కుటుంబ పాలన పోవాలని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్ ఆర్ రెండు ప్రాంతాల్ని రెండు కళ్లుగా చూసుకునేవారన్నారు. వైఎస్ షర్మిల తో వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు కలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. తాజాగా సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, మొహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌లు షర్మిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook