Telangana MLC Elections 2021 Results Live Updates: తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే మహబూబ్‌నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఏ అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
మహబూబ్‌నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆరో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి మొదటి ప్రాధాన్యత ఓట్ల(Telangana MLC Elections 2021)లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ తరువాత ఆమెకు 7,626 ఓట్ల ఆధిక్యం లభించింది. సురభి వాణికి 1,05,710 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 98,084 ఓట్లు వచ్చినట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 17,752 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ(BJP) అభ్యర్థి రామచందర్ రావుకు 16,750 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,875, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 4,387 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది.
ఇక్కడ మొత్తం 3,57,354 ఓట్లు పోలయ్యాయి. విజయం తమదేనంటూ అధికార టీఆర్ఎస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య స్వల్ప ఓట్ల వ్యత్యాసం నమోదవుతుంది. ఓవరాల్‌గా 7వేల పైచిలుకుగా పైగా బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుపై టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 7,626 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook