Ys Sharmila comments: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ రచ్చ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను అధికారపార్టీ టీఆర్ఎస్‌తోపాటు విపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. మైనార్టీ రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిప్పును రాజేశాయి. ఆ వ్యాఖ్యలను వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఖండించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసేయడం ఏంటని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చిన రిజర్వేషన్‌ను మోదీ, షా కలిసి వచ్చినా ఏం చేయలేరని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మైనార్టీల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అమిత్ షా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
అమిత్ షా వ్యాఖ్యలు చూసి.. ఊదు కాలదు..పీరు లేవదు అన్న సామెత గుర్తుకు వస్తుందన్నారు షర్మిల. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని తెలిసి..సీఎం కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతి పథకంలో వాటా ఉందని ఆయన అంటున్నారని..కేసీఆర్ అవినీతిలో వాటా లేదంటే నమ్మాలా అని ప్రశ్నించారు. 8 ఏళ్లల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 


తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనమని చెబుతూనే..తెలంగాణ(TELANGANA)లో అధికారంలోకి వస్తే కొంటామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. రైతులను కార్లతో ఢీకొట్టి చంపిన చరిత్ర బీజేపీ నేతలదని మండిపడ్డారు. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీల అమలుకు దిక్కులేదన్నారు. ఇక ఏ మొహం పెట్టుకుని ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. మొత్తంగా అమిత్ షా(AMITH SHAH) వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసింది. పరస్పరం రాజకీయ పార్టీలను విమర్శలను గుప్పించుకుంటున్నాయి.


Also read:Andrew Symonds Death: ఆండ్రూ సైమండ్స్ మృతి.. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే! భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవం


Also read:Apple iphone 11: రూ.51 వేలు విలువ చేసే 'ఐఫోన్ 11' కేవలం రూ.33 వేలకే... డిస్కౌంట్ ఇలా పొందండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.