Ktr On Amit Sha: కేంద్ర హోంశాఖ మంత్రి ఆమిత్ షా పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. అమిత్ షా హైదరాబాద్ రావడానికే ముందే ఆయన్ను విపక్షాలు టార్గెట్ చేశాయి. అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా షాకు ప్రశ్నలు సంధించారు. తెలంగాణపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారంటూ నిలదీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయినప్పటి నుంచే రాజకీయ వేడి పెరగగా.. ఆయన పర్యటన ముగిశాకా కూడా అదే కాక కొనసాగుతోంది. తుక్కుగూడ సభలో అమిత్ షా చేసిన ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ టూరిస్ట్ సీజన్ నడుస్తుందని అన్నారు. మొన్న ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇప్పుడు మరో పర్యాటకుడు వచ్చాడు అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ, అమిత్ షాను ఉద్దేశించి కామెంట్ చేశారు. వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. బీజేపీ ద్రోహ చింతన, అబద్దాలతో జీవిస్తుందని ట్విట్టర్ లో కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు, గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే వివక్ష కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణకు ఏమిచ్చారో చెప్పకుండా పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారు మండిపడ్డారు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని కేటీఆర్ తన ట్వీట్ లో చెప్పారు.
Season of political tourism continues;
Ek Aur Tourist Aaj; Aaya, Khaya, Piya, Chal Diya 😁
8 Saal Mein Kuch Nahi Diya Telangana Ko, Aaj Bhi Wahi Silsila
Wahi Jhumlabaazi Aur Dhokebaazi
Living up to its nameB - Bakwaas
J - Jhumla
P - Party— KTR (@KTRTRS) May 14, 2022
అమిత్ షా తెలంగాణ పర్యటనపై రాష్ట్ర వైద, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. శనివారం ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. అదే రోజున తెలంగాణ పర్యటకు అమిత్ షా వచ్చారు. దీంతో దాన్ని అనుకూలంగా మలుచుకున్నారు అమిత్ షా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా అంటూ అమిత్ షాను వలస పక్షులతో పోల్చి సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు హరీష్ రావు. వలస పక్షులు తమకు నచ్చిన ప్రాంతాలకు అప్పుడప్పుడు వస్తుంటాయన్నారు. అక్కడ దొరికే ఫుడ్ తింటూ సేద తీరుతాయని తన ట్వీట్ లో చెప్పారు. ఆ తర్వాత అక్కడే గుడ్లు పెట్టి.. తిరిగి తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళతాయన్నారు.
Migratory Birds visit the favourable places, enjoy the food, lay eggs n fly away happily. A representative Coincidence. #WorldMigratoryBirdDay pic.twitter.com/tPDiwF4UMn
— Harish Rao Thanneeru (@trsharish) May 14, 2022
అమిత్ షా తెలంగాణ పర్యటన కూడా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం రోజు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి హరీష్ రావు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి