YS Sharmila Slams CM KCR: హైదరాబాద్: నిన్నటి వరకు తెలంగాణ మా తాతల జాగీరు అన్నట్టు వ్యవహరించి, నేను తెలంగాణకు ముద్దుబిడ్డను అని చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ దేశంపై ఎందుకుపడ్డారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నాకు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఇంకెవ్వరికీ లేదు అని చెప్పుకొన్న దొర గారికి.. కొత్తగా దేశాన్ని దోచుకోవాలి అనే కలపడగానే.. దేశ పౌరుడిని అనే సంగతి గుర్తుకువచ్చింది అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఎద్దేవా చేస్తూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయ్యా దొర.. మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే అని దూషించావు. ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నావు.. మరి ఇప్పుడు దేశ రాజకీయాలంటూ ఆంధ్రాకు కూడా వెళ్తున్న నువ్వు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు అని వైఎస్ షర్మిళ నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం సంజాయిషీ ఇచ్చుకుంటావు, ఏ మొఖం పెట్టుకొని వెళ్లి వాళ్లను ఓట్లు అడుగుతావు అని మండిపడ్డారు.



 


ఇవాళ దేశం అంతా ఒక్కటే అని.. దేశం కోసం బీఆర్ఎస్ నిలబడుతుందని చెబుతున్న మీకు... తెలంగాణ కోడలినైన నాకు తెలంగాణలో తిరిగే హక్కు ఉంటుందని గుర్తురాలేదా అని ప్రశ్నించారు. నేను తెలంగాణ కోడిలినే అయినప్పటికీ.., నన్ను ఆంధ్రా నుంచి వచ్చిన తెలంగాణ ద్రోహి అని మీ పార్టీ వాళ్లు అవహేళన చేసినప్పుడు.. నేను కూడా ఇక్కడి కోడలినేనని, ఈ దేశ పౌరురాలినేనని గుర్తుకురాలేదా అని నిలదీశారు. నరం లేని నాలుక వంద అబద్దాలు చెబుతుందన్నట్లు మన దగ్గరికి వస్తే ఒక న్యాయం, మందికైతే మరొక న్యాయమా ? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వైఎస్ షర్మిళ సూటి ప్రశ్నలు సంధించారు.


ఇది కూడా చదవండి : Eetala Rajender visits Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు బెయిల్ రాకుండా


ఇది కూడా చదవండి : Revanth Reddy Protests: రాహుల్ గాంధీపై మోదీ సర్కారు కుట్ర


ఇది కూడా చదవండి : Telangana Rains Alert: మళ్లీ వడగండ్ల వానలు కురిసే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK