YS Sharmila: చిన్న దొరకు తెలంగాణ పరిస్థితులు తెలుసా..?: వైఎస్ షర్మిల ఆగ్రహం
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అడుగడుగునా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తున్నారు.
గతకొంతకాలంగా రైతు గోస పేరుతో ప్రతి మండలంలో ప్రత్యేక సభను ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదిక నుంచి సీఎం కేసీఆర్‌పై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. 8 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదని మండిపడుతున్నారు. కౌలు రైతులను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని..వారితో కలిసి రైతు గోస ధర్నాలో పాల్గొంటున్నారు. తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ హయాంలో ఏ ఒక్క రైతు నష్టపోలేదని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో మాట ముచ్చటను నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హామీనిస్తున్నారు. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల..మంత్రి కేటీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
చిన్న దొర కేటీఆర్‌కు ఆంధ్రాలో స్నేహితులు ఉన్నారట..ఇక్కడ ఎవరు లేరట..తెలంగాణ(TELANGANA)లో ఫ్రెండ్స్ ఉంటే పరిపాలన ఎలా ఉందో అర్థమయ్యేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు..మంత్రి కేటీఆర్‌కు స్నేహితులు కాదా అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్లు ఏమవుతారని తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారు సైతం ఇప్పుడు బాధ పడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్(KCR) ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు షర్మిల. వారికి ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పనులు చేసిన వారికి సైతం డబ్బులు రావడం లేదన్నారు. తక్షణమే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇవ్వాలన్నారు. దీనిపై మరో పోరాటం చేస్తామని వైఎస్ షర్మిల చెప్పారు.
Also read:Patiala Clashes: పంజాబ్‌లో హైటెన్షన్.. పటియాలాలో ఎస్ఎంఎస్, మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత
Also read:Face Care Tips: ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ 5 రకాల పుడ్స్ తో చెక్ పెట్టండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook