Zee Telugu News Health Conclave Cum Awards: సమాజహితం కోరే ప్రజా వైద్యులకు జీ తెలుగు న్యూస్ అవార్డులు
Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. అలాంటి వైద్య సిబ్బంది సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ... సమాజహితం కోసం పాటుపడుతున్న వైద్యులను సగర్వంగా సత్కరిస్తోంది మన జీ తెలుగు న్యూస్.
Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. డాక్టర్లను దేవుళ్లని ఎందుకు కొనియాడతారో నిరూపించింది. కొవిడ్ విలయతాండవంలో చిక్కి లక్షలాది మంది ఉక్కిరిబిక్కిరవుతుంటే.. తామున్నామని భరోసా కల్పించారు డాక్టర్లు. జనజీవనం అతలాకుతలమైన సమయంలో.. ముందు నిలబడి... కాపు కాసి... అపర బ్రహ్మలయ్యారు. వైరస్ విలయానికి తాము బలైపోతున్నా సైనికుల్లా వైరస్‌కు అడ్డుగానిలిచారు.
కరోనా కష్టకాలం వైద్యరంగానికి పెనుసవాల్ విసిరింది. ప్రపంచాన్ని అచేతన స్థితిలోకి నెట్టింది. సొంతవాళ్లు, రక్తసంబంధీకులు కూడా పరాయివాళ్లైపోయారు. కనీసం చనిపోతే దగ్గరగా వెళ్లి చూడలేని దారుణ పరిస్థితుల్లో జనం ఒకరకమైన భయంకరమైన మానసిక స్థితిలో కూరుకుపోయారు. గతంలో ఎప్పుడూ చూడని... కనీవినీ ఎరుగని.. భయంకరమైన పరిస్థితుల్లో వైద్యుడు చీకట్లో చిరుదివ్వెలా భవిష్యత్తుపై ఆశ కల్పించాడు. తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. యుద్ధ రంగంలో దూకిన సైనికుడిలా రోగుల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించాడు. రోజూ వందలాది మంది తమ కళ్ల ముందే చనిపోతున్నా.. తోటి వైద్యులు వైరస్ సోకి ప్రాణాలు విడుస్తున్నా అదరలేదు.. బెదరలేదు. తమ వృత్తిధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. తమపై ఎంతో నమ్మకంతో వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా భావించి నిస్వార్థంగా సేవ చేశారు డాక్టర్లు. చికిత్స లేని.. వ్యాధితో వచ్చిన బాధితులను కంటికి రెప్పలా కాపాడారు. వారికి మానసికంగా ధైర్యాన్నిచ్చి కోలుకునేలా చేశారు.
కరోనాపై జరిగిన యుద్ధంలో డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాత్ర కూడా వెలకట్టలేనిది. అలోపతితో పాటు హోమియోపతి, యునానీ ఇలా అన్ని రకాల వైద్యులు తమకు సాధ్యమైనంతమేర రోగులకు చికిత్సచేసి వారు కోలుకునేలా చేశారు. నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు వైరస్ నియంత్రణ కోసం కృషిచేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పోలీసులు సైతం వైరస్ నియంత్రణ కోసం కష్టపడ్డారు. ఇలా వీరందరూ గనక అడ్డుపడకపోతే.. కరోనా ఇంకెంత మంది ప్రాణాలు తీసేదో ? ఇంకెన్ని కుటుంబాలను అనాథలను చేసేదో..
ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గినా.. ఇతర వ్యాధులు ఎప్పటికప్పుడు మానవ జీవితాలకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కొత్త కొత్త సమస్యలను తీసుకొస్తోంది. డయాబెటిస్‌తో పాటు బీపీ, గుండె వ్యాధులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటన్నింటి నియంత్రణ కోసం అలుపెరగని కృషిచేస్తున్నారు వైద్యులు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్న నానుడిని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం లేకుంటే వృధా అన్న సత్యాన్ని జనాలకు చేరవేస్తూ హెల్త్ ఇండియా లక్ష్యసాధన దిశగా ముందుండి నడిపిస్తున్నారు వైద్యులు. వీరికి తోడుగా వైద్యసిబ్బంది సైతం తమవంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాంటి వైద్య సిబ్బంది సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ... సమాజహితం కోసం పాటుపడుతున్న వైద్యులను సగర్వంగా సత్కరిస్తోంది మన జీ తెలుగు న్యూస్.
Also Read : Diabetes Control Tips: ఓట్స్ పిండితో చేసిన రోటీలను తీసుకుంటే చాలు.. మధుమేహానికి గుడ్ బాయ్ చెప్పాల్సిందే
Also Read : Weight Loss Tips: ఇలా రోజూ ఉదయం ఈ పాలను తాగితే.. ఆరోగ్యంగా కేవలం 10 రోజుల్లో బరువు తగ్గుతారు
Also Read : Heart Hole Symptoms: గుండెలో రంధ్రముంటే..ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి