Nepal: నేపాల్‌లో వరుణుడి ఉగ్రరూపం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం..
Nepal news: నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 17 మంది మృత్యువాత పడ్డారు.
Nepal news: భారీ వర్షాలు నేపాల్ ను అతలాకుతలం చేస్తున్నాయి. అచ్చాం, సుదూర్‌పశ్చిమ్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు (Heavy rains in Nepal) కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో (Nepal landslides) మరో 11 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సుర్ఖేత్ జిల్లాకు విమానంలో తరలించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు మెుదలుపెట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పశ్చిమ నేపాల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ఖాడ్మండుకు 450కిలోమీటర్లు దూరంలో ఉన్న అచ్చాం, సుదూర్‌పశ్చిమ్ జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ భారీ వర్షాలకు ఏడు జిల్లాలను కలిపే భీమ్‌దుట్ట హైవేపై సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అచ్చాం జిల్లాలో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఘటన జరిగిన ప్రదేశంలో అధికారుల సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నేపాల్ జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో భారీ వర్షాలు కురవడం, కొండ చరియలు విరిగపడటం సర్వసాధారణం. నేపాల్ లో ఈ ఏడాది ఇప్పటివరకు వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా కనీసం 48 మంది మరణించగా, 12 మంది గల్లంతైనట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: Russia-Ukraine War: రష్యన్ ఆర్మీకు షాక్ ఇస్తున్న ఉక్రెయిన్, చేజారిన భూభాగాలు స్వాధీనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook