Pakistan: నీటి గుంతలో బోల్తాపడ్డ వ్యాన్... 12 మంది చిన్నారులతో సహా 20 మంది మృతి..
Pakistan: ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఓ వ్యాన్ నీటి గుంతలో బోల్తాపడిన ఘటనలో 12 మంది చిన్నారులతోసహా 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది.
Pakistan: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో (Sindh province) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో సూఫీ మందిరానికి వెళ్తున్న ఓ వ్యాన్ హైవే పక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులతో సహా కనీసం 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతదేహాలను బయటకు తీసిన అధికారులు సయ్యద్ అబ్దుల్లా షా ఇన్‌స్టిట్యూట్ సెహ్వాన్ షరీఫ్‌కు తరలించారు. ఈ వ్యాన్ ఖైర్‌పూర్ జిల్లా నుండి సెహ్వాన్‌లోని ప్రసిద్ధ సూఫీ మందిరానికి ప్రయాణీకులతో వెళ్తూ.. ఇండస్ హైవే వద్ద వరదనీటి కోసం ఏర్పాటు చేసిన గుంతలో పడినట్లు పోలీసు అధికారి ఇమ్రాన్ ఖురేషి తెలిపారు.
గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పాకిస్తాన్ లో వర్షాలు (floods in Pakistan) కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా 1600 మందికిపైగా మరణించారు. ఎనిమిది మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వర్షాలకు రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యం వల్లే తాజా ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘోర ప్రమాదంపై మాజీ రాష్ట్రపతి ఆసిఫ్ అలీ జర్దారీ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాల మరణాల రేటును కలిగి ఉన్న దేశాల్లో పాక్ మూడో స్థానంలో ఉంది. దెబ్బతిన్న హైవేలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లే దీని కారణంగా తెలుస్తోంది.
Also read: Gaza fire: పుట్టిన రోజు వేడుకలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో 17మంది మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి