Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే
కోవిడ్ 19 వైరస్ ( covid 19 virus ) కేసులు పెరిగే కొద్దీ వైరస్ జన్యువులో మార్పులు వస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే లక్షణాలుగా మనకు తెలుసు.ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలు ( Additional Symptoms of Corona virus 0 వచ్చి చేరుతున్నాయి. ఇవే ఇప్పుడు భయపెడుతున్నాయి.
కోవిడ్ 19 వైరస్ ( covid 19 virus ) కేసులు పెరిగే కొద్దీ వైరస్ జన్యువులో మార్పులు వస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే లక్షణాలుగా మనకు తెలుసు.ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలు ( Additional Symptoms of Corona virus ) వచ్చి చేరుతున్నాయి. ఇవే ఇప్పుడు భయపెడుతున్నాయి.
కరోనా వైరస్ అంటే నిన్నటి వరకూ మనకు తెలిసిన లక్షణాలు చాలా తక్కువ. దగ్గు, జ్వరం ఉంటాయని, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని. ఆ తరువాత రుచి లేకపోవడం, వాసన కోల్పోవడం కొత్తగా చేరిన లక్షణాలు. ఇప్పుడు మరి కొన్ని లక్షణాల్ని జతచేర్చుకుంది కరోనా వైరస్. లండన్ కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ( London Kings college Scientists ) చేపట్టిన అధ్యయనంలో వెలుగుచూసిన కొత్త లక్షణాలిప్పుడు భయపెడుతున్నాయి. మార్చ్, ఏప్రిల్ నెలల్లో వందలాది కోవిడ్ రోగుల లక్షణాలపై ప్రత్యేకంగా రూపొందించిన ఓ యాప్ ద్వారా కింగ్స్ కాలేజ్ ( Kings College Study on Corona virus symptoms ) ) శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. మెడ్ రిగ్జివ్ పత్రిక ఈ ఫలితాల్ని ప్రచురించింది. ఈ వైరస్ ఆరు రకాలుగా ( Six types of corona virus ) ఉంటుందని తేలింది. Also read: కరోనా కేసులపై ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
మొదటి రకం వైరస్ లో ఫ్లూ లక్షణాలన్నీ ఉంటాయి కానీ జ్వరం ఉండదు. వాసన లేకపోవడం, దగ్గు, గొంతులో మంట, ఛాతీ నొప్పి సహజంగా ఉంటాయి కానీ కండరాల నొప్పి ఉంటుంది.
ఇక రెండవ రకం వైరస్ లో జ్వరంతో పాటు ఫ్లూ లక్షణాలుంటాయి.తలనొప్పి ఉంటుంది. గొంతు బొంగురుపోతుంది.
మూడో రకం వైరస్ లో డైజెస్టివ్ సమస్యలు కన్పిస్తాయి. అంటే ఆకలి లేకపోవడం, డయేరియా రావడం, ప్రధానంగా ఉంటాయి. ఈ రకం వైరస్ లో దగ్గు, గొంతు నొప్పి ఉండవు.
నాలుగో రకంలో అయితే లక్షణాలన్నీ తీవ్రంగా ఉంటాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పితో పాటు తలనొప్పి, వాసన లేకపోవడం, రుచి కోల్పోవడం ఉంటుంది. వీటితో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. Also read: Covid-19 Tests: అమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక కోవిడ్-19 పరీక్షలు
ఐదవ రకంలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. తలనొప్పి, వాసన లేకపోవడం, దగ్గు, జ్వరం, కండరాల నొప్పి, ఆయాసం, ఆకలి లేకపోవడం సహజంగానే కాస్త ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దీనికి తోడు స్థిమితం లేకపోవడం రెస్ట్ లెస్ నెస్ ఉంటుంది.
ఆరవ చివరి రకం వైరస్ లో లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. మొదటి ఐదు రకాల లక్షణాలతో పాటు పొత్తి కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది.
ఏ రకం వైరస్ ఎంతమందికి సోకిందనే విషయాన్ని పరిశీలిస్తే మొదటి రకం 1.5 శాతంగా తేలింది. రెండోరకం వైరస్ 4.4 శాతం కన్పించింది. మూడోరకం వైరస్ 3.3. శాతం మందిలో ధృవీకరణైంది. నాలుగో రకం వైరస్ 8.6 శాతం మందిలోనూ, ఐదవ రకం వైరస్ 9.9 శాతం మందిలోనూ కన్పించగా...ఆరవది మాత్రం అధికంగా 19.8 శాతం మందిలో కన్పించింది. Also read: COVID-19 patient: క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం