COVID-19 patient: క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం

Woman raped in quarantine centre: కరోనావైరస్ సోకడంతో క్వారంటైన్ సెంటర్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న  40 ఏళ్ల మహిళపై అదే క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కరోనా రోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పల్వెల్‌లో ( Palvel rape case ) చోటుచేసుకుంది.

Last Updated : Jul 18, 2020, 01:18 PM IST
COVID-19 patient: క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం

Woman raped at quarantine centre: కరోనావైరస్ సోకడంతో క్వారంటైన్ సెంటర్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న  40 ఏళ్ల మహిళపై అదే క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కరోనా రోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పల్వెల్‌లో ( Palvel rape case ) చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. క్వారంటైన్ కేంద్రానికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. క్వారంటైన్ కేంద్రంలో అత్యాచారంపై పన్వెల్ జోన్-2 ఏసిపి రవీంద్ర గీతె స్పందిస్తూ.. క్వారంటైన్ కేంద్రంలో మహిళపై కరోనావైరస్ ( Coronavirus ) సోకిన మరో రోగి అత్యాచారం జరిగినట్టు తమకు ఫిర్యాదు అందిందని.. వెంటనే వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.  ( Also read: యాంకర్ అనసూయ #CybHer క్యాంపెయిన్‌.. ఎనర్జిటిక్ వీడియో )

మండిపడిన బీజేపి ( BJP slams Maha govt ):
క్వారంటైన్ కేంద్రంలోనే మహిళపై అత్యాచారం జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించిన బీజేపి ( BJP )... రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైన మహారాష్ట్ర సర్కారు ( Maharashtra govt ).. చివరకి క్వారంటైన్ కేంద్రాల్లో మహిళలకు రక్షణ కల్పించడంలోనూ విఫలమైందని మండిపడింది. క్వారంటైన్ కేంద్రాల్లో ఇంత నిర్లక్ష్యం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించిన బీజేపి నేత రామ్ కదం.. క్వారంటైన్ సెంటర్లలో కరోనా రోగులకు సమయానికి తిండి కూడా పెట్టడం లేదని ఆరోపించారు.
 ( Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )

Trending News