Covid-19 Tests: అమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక కోవిడ్-19 పరీక్షలు

Coronavirus Tests: కరోనావైరస్ సంక్రమణను నిర్ధారించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో భారత్ ఉందని అమెరికా వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌ నాన్సీ తెలిపారు.

Last Updated : Jul 17, 2020, 11:28 PM IST
Covid-19 Tests: అమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక కోవిడ్-19 పరీక్షలు

Covid-19 Tests: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణను నిర్ధారించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిర్ధారణ పరీక్షల ( Covid-19 Tests ) సంఖ్యను పెంచుతున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో భారత్ ఉందని అమెరికా వైట్ హౌజ్ ప్రెస్ ( White House ) సెక్రటరీ కైలీ మెక్‌ నాన్సీ ( Kaileigh McNancy ) తెలిపారు. అమెరికాలో ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల 2 లక్షల పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో ఇప్పటి వరకు 1.2 కోట్ల కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. మొత్తం పరీక్షల్లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి కరోనా పరీక్షల్లో పాజిటీవ్ ( Coronavirus Positive ) అని తేలింది. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

కరోనావైరస్ వల్ల ఇప్పటి వరకు సుమారు లక్షా 38 వేల మంది మరణించారు. కరోనావైరస్ సంక్రమణను ( Coronavirus Outbreak ) కట్టడి చేయడానికి అమెరికా పరీక్షల సంఖ్యను పెంచింది అని.. అందుకే నిర్ధారణ పరీక్షల సంఖ్య ప్రపంచంలో మరే దేశంతో పోల్చుకోలేనంత ఎక్కువగా ఉంది అని ఆమె తెలిపారు. అమెరికా తరువాత భారత దేశంలో అత్యధికంగా కోవిడ్-19 పరీక్షలు జరుగుతున్నాయి మెక్ నాన్సీ తెలిపారు.

Arogya Setu: ఆరోగ్యసేతుకు ఆరుదైన ఘనత

Trending News