Impeachment on Trump: అమెరికా ( America ) నూతన అధ్యక్షుడు జో బిడెన్‌పై ( Joe Biden ) అందరి దృష్టీ నెలకొంది. అగ్రరాజ్యపు అధ్యక్షుడిగా ఏం చేస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తొలిరోజే కీలకమైన ఆదేశాలపై సంతకాలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన జో బిడెన్..ఇప్పుడు విదేశీ సంబంధాలపై ఫోకస్ పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బిడెన్ ( Joe Biden ) ఇప్పుడు అత్యంత కీలకమైన విదేశీ సంబంధాలపై దృష్టి సారించారు. ముందుగా పొరుగుదేశమైన కెనడా ( Canada ) ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా వైరస్ ( Corona virus ) ‌పై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్ధిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులపై కలిసి పోరాటం చేయాల్సి ఉందన్నారు జో బిడెన్. అనంతరం మెక్సికో ( Mexico ) అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడర్‌తో మాట్లాడారు. మరి కొంతమంది విదేశీ నేతలతో మాట్లాడనున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో కెనడా, మెక్సికో దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. 


ఇక అమెరికా రక్షణ శాఖ మంత్రిగా తొలిసారి నల్ల జాతీయుడైన రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. ఈయన ఎంపికను సెనేట్ ( Senate ) బలపర్చింది. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ( Donald trump ) పై ప్రవేశపెట్టిన అభిశంసన ( Impeachment )పై ఫిబ్రవరి 8 న విచారణ ప్రారంభం కానుంది. జనవరి 6వ తేదీన అమెరికాలోని కేపిటల్ భవనం ( Capitol hills ) పై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పి..అరాచకం సృష్టించడమే కాకుండా..ఐదుగురి మృతికి కారణమయ్యారని ఆయనపై ఆరోపణలున్నాయి. ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్ గద్దె నుంచి దిగిపోయినా సరే..అభిశంసన ప్రక్రియను అధికారికంగా ముగించాలనేది డెమోక్రట్ల ( Democrats ) పట్టుదలగా ఉంది.  


Also read: Joe Biden Major Decisions: అధ్యక్షుడిగా తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్న జో బిడెన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook