Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం వరుసగా మరో షాక్ ఇచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆఫ్ఘన్ పరిస్థితుల్ని అంచనా వేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా తాలిబన్లకు(Talibans)వరుస షాకులిస్తోంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తరువాత ఆ దేశంలో మారుతున్న పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమెరికన్ బ్యాంక్‌లలో ఆ దేశానికి చెందిన ఖాతాల్ని బ్లాక్ చేస్తూ జో బిడెన్(Joe Biden)నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరో షాక్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌కు(Afghanistan)ఆయుధాల అమ్మకాన్ని నిలిపివేయాలని జో బిడెన్ నిర్ణయించారు.ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలో రావడంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని తెలుస్తోంది. ఈ విషయమై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్..రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో రక్షణ కాంట్రాక్టర్లకు సమాచారం అందించింది. 


మరోవైపు ఆఫ్ఘన్‌ను వశపర్చుకున్న అనంతరం అమెరికాకు(America)చెందిన బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు తమతో జరిగిన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రక్షణ సామగ్రిని స్వాధీనపర్చుకున్నారంటూ ఆగ్రహంగా ఉంది. ఇందులో భాగంగానే ఆయుధాల అమ్మకాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆయుధాల్లో బ్లాక్‌హాక్ హెలీకాప్టర్లు, ఏ-29 సూపర్ టుకానో అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, మైన్ రెసిస్టెంట్ హమ్వీస్‌తో పాటు ఎం4 కార్బైన్‌లు, ఎం6 రైఫిల్స్ ఉన్నాయి. గత 20 ఏళ్లలో 227 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని అమెరికా విక్రయించింది. 


Also read: Afghanistan: ప్లీజ్‌ మా పిల్లలనైనా తీసుకెళ్లండి..ఇనుప కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook