Joe Biden Comments: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్ ఈదుల్ ఫిత్ర్ వేడుకల్లో జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంజాన్ ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజానీకానికి బాసటగా నిలుస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో జరిగిన ఈదుల్ ఫిత్ర్ వేడుకల్లో జో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


జో బిడెన్ ఏమన్నారు


ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై హింస పెరుగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పష్టం చేశారు. ముస్లింలకు ప్రపంచవ్యాప్తంగా సమస్యలు, హెచ్చరికలు ఎదురవుతున్నాయని చెప్పారు. అయినా సరే అమెరికాను శక్తివంతంగా మలిచేందుకు ముస్లింలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక కార్యక్రమాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రస్తావించారు. కేవలం మత విశ్వాసాల కారణంగా పీడితుల పట్ల ఎప్పుడూ వివక్ష ప్రదర్శించకూడదని జో బిడెన్ సూచించారు. అమెరికా  సమాజంలోని ముస్లింలు..హింస, ఇస్లామోఫోబియో, వివక్షతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. వైట్‌హౌస్‌లో ముస్లింలకు ఆతిధ్యమిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 


రోహింగ్యాల ప్రస్తావన


ప్రపంచవ్యాప్తంగా ముస్లింల గురించి ప్రస్తావిస్తూనే..రోహింగ్యాల గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. చైనాలోని ఉయిగర్ ముస్లింలు, ఈశాన్య ఇండియా, బర్మా దేశాల్లో ఉన్న రోహింగ్యా తెగ ముస్లింల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కరవు, హింస, ఘర్షణలు, వ్యాధులు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆయా ప్రాంతాల్లోని ఉయిగర్, రోహింగ్యా ముస్లింలు ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకోలేకపోతున్నట్టు తెలిపారు. అటువంటి ముస్లిం తెగల్ని ఇవాళ పండుగ సందర్భంగా గుర్తుంచుకుంటున్నామని చెప్పారు. 


Also read: Abortion‌ law in America: అమెరికాలో అబార్షన్‌ చట్టం రద్దు కానుందా? తీర్పు ఇవ్వబోతున్న సుప్రీంకోర్టు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook