కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి వ్యాక్సిన్  కోసం అమెరికా మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను కనుగొన్న నేపధ్యంలో..అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా కంపెనీ ( Moderna company ) తో భారీ ఒప్పందమే కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ 150 కోట్ల డాలర్లు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కు రష్యా వ్యాక్సిన్ ( Russia vaccine ) ను ప్రకటించడమే కాకుండా సెప్టెంబర్ ( September ) నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పడంతో అమెరికా ప్రభుత్వానికి కలవరం ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ( America president Donald trump ) కచ్చితమైన వ్యాక్సిన్ తనదేనంటూ చెప్పుకురావడమే కాకుండా...ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్న మోడెర్నా కంపెనీతో మరో భారీ ఒప్పందం కుదర్చుకున్నారు. ఏకంగా వంద మిలియన్ డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్  పంపిణీ చేసేలా ఆ ఒప్పందమైంది. ఈ ఒప్పందం విలువ చిన్నదేమీ కాదు. ఏకంగా 150 కోట్ల డాలర్లు ( 150 crore dollars ). మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ కు అనుమతి లభించిన వెంటనే వంద మిలియన్ డోసుల్ని వేగంగా ఉత్పత్తి చేసివ్వాలి. మోడెర్నా కంపెనీ అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలు సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నాయి. Also read: Sputnik V: రెండు వారాల్లో రష్యా వ్యాక్సిన్ సప్లై షురూ