America Elections: యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోని చాలా అంశాలు అమెరికా వైఖరిపై ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఎన్నికలు మన భారత్‌ పై  ఎలాంటి ప్రభావం చూపుతాయని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ సంస్థల నిర్వహణకు అమెరికా ఇప్పటికీ అతిపెద్ద దాతగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా భారత్, అమెరికాల మధ్య సంబంధాలు స్థిరంగానే ఉంటాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కు ప్రయోజనం కలుగుతోందనే చర్చ నడుస్తోంది. ఎవరు గెలిచినా భారత్ ను పక్కన పెట్టడం కుదరదు. జనాభా పరంగా అమెరికాకు భారత్ అతిపెద్ద మార్కెట్. అంతేకాదు అమెరికా దేశ ఉన్నతిలో మన భారతీయలు పాత్రను కాదనలేము. అటు అధ్యక్ష్య అభ్యర్ధిగా ఉన్న కమలా హారీస్ కూడా భారత్ మూలాలున్న ఆఫ్రో అమెరికన్ కావడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక అంశం అనే చెప్పాలి.


మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు కావాలని రిపబ్లిక్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈయన ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయనపై రెండు సార్లు దాడి జరగడం. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచంలో రష్యా, ఉక్రెయిన్ అల్లకల్లోలం, అప్ఘనిస్తాన్ ను తాలిబాన్ల పరం చేయడం.. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్  పాలస్తీనా, ఇరాన్, యెమన్, లెబనాన్ యుద్ధాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి.


అమెరికా ఆయుధ లాబీ కోసమే జో బైడెన్ ఈ యుద్ధాలు చేయిస్తుడానే ప్రతిపక్షాలు ఆరోపణలున్నాయి. మరోవైపు డెమొక్రాటిక్ పార్టీ తరుపున జార్జ్ జోరోస్ వంటి భారత వ్యతిరేక డీప్ స్టేట్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్ వస్తే.. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాలకు ఓ ముగింపు దొరుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ నినాదం భారతీయ ఉద్యోగులకు శరాఘాతంగా పరిణమించబోవచ్చు. మొత్తంగా ఈ రోజు జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తురానేది చూడాలి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.