Farmers protest: వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న రైతుల నిరసన సెగ అమెరికాను తాకింది. అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ..అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు ( New Agriculture acts ) వ్యతిరేకంగా భారతదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ( Delhi Borders ) రైతులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. ఈ నిరసన సెగ ఇప్పుడు అమెరికాను సైతం తాకింది. అమెరికా సెనేటర్లు ( America senators ) రైతుల నిరసనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ప్రమీలా జయపాల్ సహా ఏడుగురు సెనేటర్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయ శంకర్ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తి..రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. 


Also read: Kazakhstan: సెక్స్ బొమ్మను వివాహమాడిన బాడీబిల్డర్


లేకపోతే ఈ ఆందోళన కారణంగా పంజాబ్‌తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ప్రత్యేక ఆందోళన కల్గించే అంశంగా మారుతుందన్నారు. భారతీయ రాష్ట్రాలకు చెందిన అమెరికన్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. చాలామంది భారతీయ అమెరికన్లు పంజూబ్‌లో భూమిని కలిగి ఉన్నారని..వారి కుటుంబాల శ్రేయస్సు గురించి ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..విదేశాల్లో రాజకీయ ప్రసంగ స్వేచ్ఛపై అమెరికా నిబద్ధతను బలోపేం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 


కాగా..రైతుల ఆందోళన ( Farmers protest ) కు ఇంతకుముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటీషు సిక్కు లేబర్ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ ధేసీలు మద్దతిచ్చారు. జనవరిలో జరగనున్న భారత పర్యటనలో నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) తో ఈ సమస్యపై చర్చించాలని బ్రటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ( Britain pm Bo‌కు విజ్ఞప్తి చేశారు. అయితే కొత్త రైతు చట్టాలు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. రైతుల ఆందోళనపై విదేశీ నేతలు చేస్తున్న ప్రకటనల్ని అనవసరమైనవిగా కొట్టిపారేసింది. 


Also read:New coronavirus strain: శరవేగంగా కొత్త కరోనా వైరస్..ఎందుకింత భయానకం