Anmol Bishnoi Arrest: 2022లో హత్యకు గురైన పంజాబ్‌‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులో అన్మోల్  అనుమానితుడిగా ఉన్నాడు. ముంబైలో సంచలనం సృష్టించి న బాబా సిద్దిఖీ హత్య కేసులోను ఆరోపణ లు ఎదుర్కొంటున్నాడు. అన్మోల్‌‌ను భారత్‌‌ కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ స్పెషల్ కోర్టులో ముంబై పోలీసులు ఇటీవల పిటిషన్  దాఖలు చేశారు. దీంతో అతడిపై నాన్‌‌బెయిలబుల్‌‌ వారెంట్‌‌ జారీ అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్ పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో అమెరికా పోలీసులు అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. త్వరలో అతన్ని భారత పోలీసులకు అప్పగించనున్నారు. అంతేకాదు అమెరికా, కెనడాల్లో భారత వ్యతిరేకులను హత్య చేయడంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉంది. జైల్లో లారెన్స్ ఉన్న .. బయట కీలక ఆపరేషన్లు అన్ని బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ నేతృత్వంలోనే జరగుతున్నాయి.


మొత్తంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లే లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. అప్పట్లో 1998లో సల్మాన్ ఖాన్.. ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ లో కృష్ణ జింకలను వేటాడారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు కోర్డు శిక్ష విధించిన ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. అయితే బిష్ణోయ్ తెగ ఎంతో ఇష్టంగా పూజించే కృష్ణ జింకలను వేటాడి సల్మాన్ పెద్ద తప్పు చేసాడని లారెన్స్ గ్యాంగ్ హెచ్చరిక జారీ చేసింది. ఆయన తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరితే.. తాము సల్మాన్ ను ఒదిలేస్తామని చెబుతున్నారు. కానీ సల్లూ మాత్రం.. తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పకపోవడంపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ పై పగపట్టింది. దీంతో అతనికి సన్నిహితంగా మెలుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా తెరపై హీరోగా నటిస్తూన్న సల్మాన్ .. నిజ జీవితంలో విలన్ గా ప్రవర్తిస్తున్నాడనేది బిష్ణోయ్ ను సమర్థించే వాళ్ల వాదన. మరోవైపు బిష్ణోయ్.. తమ తెగ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణ జింకలను సల్మాన్.. వేటాడటంతో పాటు ఎలాంటి పశ్చాతాపం ప్రకటించకపోవడంతోనే అతనిపై పగపట్టినట్టు చెబుతున్నారు. ఓ రకంగా బిష్ణోయ్ ను సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు.  


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter.