ప్రపంచవ్యాప్తంగా వివాదం రేపిన పెగసస్ స్పైవేర్ ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ కంపెనీ యాపిల్ సంస్థ కోర్టులో కేసు వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు(NSO Group) అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్ దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో ప్రముఖ కంపెనీ యాపిల్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఐఫోన్ వంటి తమ సంస్థకు చెందిన ఉత్పత్తుల్లో పెగసస్ స్పైవేర్ జొప్పించకుండా నిరోధించాలని కోరింది. అత్యంత అధునాతన సైబర్ నిఘా సాంకేతికతతో ఎన్ఎస్ఓ ఉద్యోగులు అనైతిక చర్యలకు పాల్పడే కిరాయి సైనికులుగా మారారని యాపిల్ (Apple)సంస్థ ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లపై కూడా పెగసస్ నిఘా ఉందని స్పష్టం చేసింది. కొన్నిదేశాల్లో ప్రభుత్వాల అండతో పనిచేసే ఎన్ఎస్ఓ గ్రూపులు ఏ విధమైన జవాబుదారీతనం లేకుండా మిలియన్ల డాలర్లను అత్యాధునిక నిఘా వ్యవస్థ అభివృద్ధికి వెచ్చిస్తున్నాయని విమర్శించింది. 


ఇప్పటికే ఇండియాలో మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగసస్ స్పైవేర్‌తో(Pegasus Spyware) భారత ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో సుప్రీంకోర్టు ముగ్గురు సాంకేతిక నిపుణులతో దర్యాప్తు కమిటీని నియమించింది. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో యాపిల్ సంస్థ(Apple) పిటీషన్‌కు ఎన్ఎస్ఓ గ్రూపు సమాధానమిచ్చింది. తామెలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం లేదని..కేవలం ప్రభుత్వాలకే పెగసస్ సాఫ్ట్‌వేర్ అమ్ముతున్నామని చెబుతోంది. 


Also read:  Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook