Ancient Sun Temple: సూర్య దేవాలయాలు ఇండియాలోనే కాదు..యూరప్ దేశాల్లో కూడా ఉండేవి. ఆ చరిత్ర ఇప్పుడు మరోసారి బయటపడింది. అత్యంత పురాతనమైన సూర్య దేవాలయం ఈజిప్టులో మరోసారి పురావస్తు తవ్వకాల్లో వెలుగు చూసింది. ఆ విశేషాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుని పూజించే సంప్రదాయం కేవలం ఇండియాలోనే కాదు ఒకప్పుడు యూరప్ దేశాల్లో కూడా ఉండేది. ఫిరౌన్ లేదా ఫారోహ్(Pharaoh Dynasty) రాజుల కాలంలో ఈజిప్టు ఉన్నప్పుడు సూర్యుడిని లేదా చంద్రుడిని ఇలా వివిధ రకాలుగా పూజించేవాళ్లు. తరువాత కాలంలో ఆ ఆచారం పోయింది. అయితే అప్పట్లో రాజులు నిర్మించిన దేవాలయాలు ఇప్పుడు అప్పడప్పుడూ పురావస్తు తవ్వకాల్లో బయటపడుతూ నాటి ఆచారానికి చరిత్రకు సాక్ష్యం పలుకుతున్నాయి.


ఇటీవల ఈజిప్టులో పురావస్తు అధికారులు జరిపిన తవ్వకాల్లో ఏకంగా 4 వేల 5 వందల ఏళ్లనాటి సూర్య దేవాలయం(Sun Temple) బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా ఈజిప్టు పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. 4 వేల 5 వందల ఏళ్ల క్రితం అంటే(Ancient Sun Temple) బీసీలో 25వ శతాబ్దం నాటి పురాతన సూర్య దేవాలయంగా పరిగణిస్తున్నారు. ఈజిప్టును ఒకప్పుడు పాలించిన ఫారోహ్ లేదా ఫిరౌన్‌ల కాలంలో ఆరు దేవాలయాలు నిర్మించారు. కన్పించకుండా పోయిన ఆరు సూర్య దేవాలయాల్లో ఇది ఒకటని పురావస్తు అధికారులు చెబుతున్నారు. అబూ ఘురాబ్‌లో మరో ఆలయంలో ఖననం చేసిన అవశేషాలి పురావస్తు అధికారుల బృందం కనుగొంది. ఈజిప్టు(Egypt) పాలకులు అప్పట్లో నిర్మించిన ఆరు సూర్య దేవాలయాల్లో రెండు ఇప్పటికే కనుగొనగా..ఇది మూడవదంటున్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింత తవ్వినప్పుడు మట్టి ఇసుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరో భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 


Also read: Mc Donalds: టాయ్‌లెట్ వివాదంలో చిక్కుకున్న మెక్‌డోనాల్డ్స్ సంస్థ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook