పాకిస్తాన్‌ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కరాచీ (Karachi) లోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (Pakistan Stock Exchange) భవనంపై సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వణికిస్తోన్న కరోనా.. భాగ్యనగరంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Terror Attack On Pakistan Stock Exchange దాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులు సహా 10 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఒక పోలీసు సహా ఏడుగురిపైగా గాయపడ్డారు. మొదట కేఎస్ఈ (KSE) సమీపంలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరారు. ఆ తరువాత లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే పోలీసులు, రేంజర్స్, అధికారులు సంఘటన స్థలానికి చేరుకోని నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాకిస్తాన్ వార్తా సంస్థ డాన్, సింధ్ అధికారవర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుంచి పోలీసులు ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఉగ్రవాదులు పోలీసు యూనిఫాం ధరించి లోపలికి వచ్చారని పేర్కొంటున్నారు. కోటి దాటిన కరోనా కేసులు.. మరణాలు ఐదు లక్షలకుపైనే..


దాడిని ఖండించిన సింధ్ గవర్నర్..
సింధ్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పందల చర్యగా అభివర్ణించారు.


కరాచీలో హై అలర్ట్..
ఉగ్రదాడి అనంతరం కరాచీలోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. II చుండ్రిగర్ రహదారిని పూర్తిగా మూసివేశారు. అయితే II చుంద్రిగర్ రహదారిని పాకిస్తాన్ వాల్ స్ట్రీట్‌గా పిలుస్తారు. పాకిస్తాన్‌లో కరాచీ ఆర్థిక రాజధానితోపాటు ముఖ్యమైన నగరాల్లో ఒకటి, ఈ నేపథ్యంలోనే కరాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ బిల్డింగ్ మీద ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ