Ukraine Maternity Hospital: మెటర్నిటీ హాస్పిటల్‌పై రష్యా బాంబుల వర్షం.. శిథిలాల కింద నవజాత శిశువులు, గర్భిణులు!!
Ukraine Maternity Hospital. ఉక్రెయిన్‌పై నిప్పులు కురిపిస్తున్న రష్యా సేనలు చివరకు ఆసుపత్రులనూ వదిలిపెట్టడం లేదు. మేరియుపొల్‌లో బుధవారం చోటు చేసుకున్న బాంబు దాడిలో ఓ ప్రసూతి ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది.
Russian Airstrike hits Ukraine maternity hospital: ఉక్రెయిన్‌లోని రష్యా సేనల క్రూరత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోతోంది. 15 రోజులుగా దాడులకు తెగబడుతున్న రష్యా.. బుధవారం మరింతగా రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై నిప్పులు కురిపిస్తున్న రష్యా సేనలు చివరకు ఆసుపత్రులనూ వదిలిపెట్టడం లేదు. మేరియుపొల్‌లో బుధవారం చోటు చేసుకున్న బాంబు దాడిలో ఓ ప్రసూతి ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పదుల సంఖ్యలో నవజాత శిశువులు, గర్భిణులు చిక్కుకొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది.
మేరియుపొల్‌లోని ఓ మెటర్నిటీ హాస్పిటల్‌పై రష్యా సేనలు బుధవారం బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఆ ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. ప్రధాన వార్డులు, ఆపరేషన్ థియేటర్లు అన్ని నాశనం అయ్యాయి. శిథిలాల కింద అప్పుడే పుట్టిన పిల్లలు, గర్భిణులు ఉన్నారు. పలువురు రోగులు కూడా చనిపోయారు. పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లింది. అడుగడుగునా శిథిలాలు, మెలితిరిగిన ఉక్కు కడ్డీలు, పగిలిపోయిన కిటికీలతో ఆ ప్రాంతం మొత్తం బీభత్సంగా మారింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ దాడిని రష్యా చేసిన దురాగతంగా అభివర్ణించారు.
ఉగ్రవాద కార్యకలాపాలను ఇంకా ఎంతకాలం భరిస్తామంటూ ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ ప్రశ్నించారు. తమ గగనతలాన్ని 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని పశ్చిమ దేశాలకు మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. 'ప్రసూతి ఆసుపత్రిపై బాంబు దాడి చేయడం దారుణం. ఎంతో ప్రాణనష్టం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికిప్పుడు మా గగనతలాన్ని మూసేయండి. దాంతో ఈ మరణహోమాన్ని ఆపేయండి. మీరు మానవత్వాన్ని కోల్పోయారు' అంటూ జెలెన్‌స్కీ మండిపడ్డారు.
రాజధాని కీవ్‌లోని జనావాసాలపైనా రష్యా సేనలు క్షిపణులు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. దాంతో పలు భవంతులు, వంతెనలు ధ్వంసం అయ్యాయి. క్షిపణి దాడుల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి కీవ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. మరోవైపు యుద్ధంలో మరణించిన పౌరులను మేరియుపొల్‌లో సామూహికంగా ఖననం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చివరి చూపుకు నోచుకోవడం లేదు.
Also Read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత
Also Read: Horoscope Today March 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధననష్టం తప్పదు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి