Horoscope Today March 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధననష్టం తప్పదు!!

March 10 2022, Daily Horoscope: కర్కాటకం, మకర రాశుల వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారికి ఈరోజు అధిక ధనవ్యయం తప్పదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 08:07 AM IST
  • Match 10 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి ధనవ్యయం తప్పదు
Horoscope Today March 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధననష్టం తప్పదు!!

Daily Horoscope March 10 2022: మేషం ( Aries): ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త అందుతుంది. అనవసర ధనవ్యయం ఉంది. ఇష్టదైవారాధన మంచిది.

వృషభం (Taurus): ప్రయత్నాలు అన్ని ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మిథునం (Gemini): పనులకు ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

కర్కాటకం (Cancer): మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. అధిక ధన నష్టం ఉంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం (Leo): ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చేకాలం. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య (Virgo): ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయబేధాలు ఉన్నాయి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

తుల (Libra):మీ మీ పనుల్లో అనుకున్నదానికన్నా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. అష్టమ చంద్ర స్థితి అనుకూలించడం లేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం ఉంది. ప్రయాణంలో జాగ్రత్త. చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచిది.

వృశ్చికం (Scorpio): శుభ ఫలితాలు ఉన్నాయి. శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణ సూచన ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది. 

ధనస్సు (Sagittarius): అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గొడవలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. దుర్గాదేవి అష్టోత్తరం చదవడం మంచింది.

మకరం (Capricorn): ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. అధిక ధన నష్టం ఉంది. శివనామాన్ని జపించాలి.

కుంభం  (Aquarius): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. నవగ్రహ ధ్యానం శుభాన్ని చేకూరుస్తుంది.

మీనం (Pisces): గ్రహబలం అనుకూలంగా ఉంది. చేసే పనులు వెంటనే ఫలిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.

Also Read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత

Also Read: Bandi Sanjay on CM KCR: ఆ దెబ్బతోనే కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు... ఇది బీజేపీ విజయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News