Pakistan bomb blast: పాకిస్థాన్‌లో పండుగ వేళ విషాదం.. ఆత్మాహుతి దాడిలో 52 మంది మృతి..
Pakistan bomb blast: పాకిస్థాన్‌లో ఈద్ మిలాదున్ నబీ పండుగ వేళ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 52 మంది మరణించగా.. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
Suicide blast in Pakistan: పాకిస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించగా.. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మస్తుంగ్ జిల్లాలోని అల్ ఫలాహ్ రోడ్‌లోని మసీదు వద్ద శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డీఎస్పీ నవాజ్ గష్కోరి కూడా మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూప్ కూడా ప్రకటించలేదు.
వివరాల్లోకి వెళితే..
సెప్టెంబరు 29న ముహమ్మద్ ప్రవక్త జయంతి. ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని అల్ ఫలాహ్ రోడ్‌లోని మదీనా మసీదు వద్ద గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. ఈ బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 50 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మహ్మద్ జావేద్ లెహ్రీ తెలిపారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు జిల్లా ఆరోగ్య అధికారి రషీద్ ముహమ్మద్ సయీద్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. రెస్క్యూ టీమ్‌లను మస్తుంగ్‌కు పంపించామని.. తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలించామని.. అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించామని బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జాయ్ తెలిపారు. ఈ పేలుడుకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ డోమ్కీ అధికారులను ఆదేశించారు. మస్తుంగ్ జిల్లాలో గత 15 రోజుల్లో ఇది రెండోది. ఈ నెల ప్రారంభంలో ఇదే జిల్లాలో జరిగిన పేలుడులో కనీసం 11 మంది గాయపడ్డారు.
Also Read: India Canada News: ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తలకు కేంద్రం కీలక ప్రకటన..ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook