Coal mine accident in Russia: రష్యాలోని సైబీరియాలో ఉన్న ఇస్త్‌వ్యజ్‌నయ అనే బొగ్గు గనిలో (Coal Mine) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు రెస్క్యూ సిబ్బంది సహా 52 మంది మృతి చెందారు. గనిలో మీథేన్ వాయువు లీకై పేలుడు సంభవించడంతో బొగ్గుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో గనిలో భారీ ఎత్తున విష వాయువులు (Toxic gases leak in coal mine) విడుదలయ్యాయి. దీంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకూ 14 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 38 మంది మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం గని మొత్తం మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ విష వాయువులతో నిండిపోవడంతో సహాయక చర్యలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో గనిలో (Coal Mine Tragedy) మొత్తం 285 మంది కార్మికులు విధుల్లో ఉండగా 239 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. వీరిలో 49 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. రష్యాలో 2010 తర్వాత ఇదే అత్యంత ఘోరమైన గని ప్రమాదంగా చెబుతున్నారు. 2010లో కెమెరొవో రీజియన్‌లోని రస్పద్‌స్కయ అనే బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 91 మంది మృతి చెందారు.


గని ప్రమాదం (Coal Mine Accident) నుంచి బయటపడిన కార్మికులు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'మొదట్లో అసలేం జరిగిందో తెలియలేదు. అప్పటికే గ్యాస్ లీకవడాన్ని పసిగట్టాం. వెంటనే గని లోపలి నుంచి ఉపరితలం పైకి చేరుకున్నాం.' అని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుడు ఒకరు తెలిపారు. మరో కార్మికుడు మాట్లాడుతూ... గని మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో అసలేమీ కనిపించలేదన్నాడు. నేలపై పాకుతూనే ఉపరితలం పైకి చేరుకునే ప్రయత్నం చేశానని... ఈ క్రమంలో రెస్క్యూ సిబ్బంది తనను పైకి లాగి రక్షించారని తెలిపాడు. వారే గనుక లేకపోయి ఉంటే తాము చనిపోయేవాళ్లమని వాపోయాడు.


Also Read: Karimnagar: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం, మానకొండూరు వద్ద ఘటన


బొగ్గు గని ప్రమాద ఘటనపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladmir Putin) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి (Coal Mine Accident) బాధ్యులుగా గని డైరెక్టర్, ఇద్దరు సీనియర్ మేనేజర్లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook