Karimnagar Accident: చెట్టును ఢీకొట్టిన కారు..నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్రగాయాలు

Karimnagar Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 11:02 AM IST
  • మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం
  • నలుగురు మృతి, ఒకరికి గాయాలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Karimnagar Accident: చెట్టును ఢీకొట్టిన కారు..నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్రగాయాలు

Karimnagar Accident: కరీంనగర్‌ జిల్లా(Karimnagar District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటన(Car Accident)లో నలుగురు మృతి చెందగా...ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మానకొండూరు(Manakondur) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. 
కరీంనగర్‌(Karimnagar)లోని జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల బాలాజీ, శ్రీరాజు, జలంధర్‌, సుధాకర్‌రావు గురువారం ఉదయం బంధువుల పెద్దకర్మ కార్యక్రమానికి ఖమ్మంలోని కల్లూరుకు వెళ్లారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి కరీంనగర్‌కు బయలు దేరారు. శుక్రవారం తెల్లవారుజామున మానుకొండూరు సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టు(Tree)ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, బాలాజీ, శ్రీరాజు, జలంధర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 

Also Read: Father rapes Daughter: కన్నకూతురినే గర్భవతి చేసిన తండ్రి..ఆ విషయం తల్లికి తెలిసి...

స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మానుకొండూరు సీఐ కృష్ణారెడ్డి మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు.  తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News