ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ( Corona virus ) ఉధృతి ఆగడం లేదు. వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ ( Covid 19 vaccine ) అబివృద్ధికి ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుండగా..ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ను నాసల్ స్ర్పేతో ( Nasal spray ) చెక్ పెట్టవచ్చా..అంటే అవుననే అంటున్నారు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ( Australian scientists ). జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే నాసల్‌ స్ర్పేతో కరోనాను కట్టడి చేయవచ్చని అంటున్నారు. ఆస్ట్రేలియా బయోటెక్‌ కంపెనీ ఎనా రెస్పిరేటరీ జంతువుల మీద చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నాసల్‌ స్ప్రే వాడకంతో కరోనా వైరస్‌ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. 


ఆస్ట్రేలియన్ కంపెనీ శాస్త్రవేత్తలు ఫెర్రెట్స్‌ మీద వ్యాక్సిన్‌కి బదులుగా ఐఎన్‌ఎన్‌ఏ-051 ( INNA-051 ) ఉత్పత్తిని ప్రయోగించారు. ఇది కోవిడ్ 19 వైరస్ ( Covid19 Virus ) కు కారణమయ్యే వైరస్‌ స్థాయిని 96 శాతం వరకు తగ్గించిందని కంపెనీ తెలిపింది. బ్రిటీష్‌ ప్రభుత్వ సంస్థ పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ ఈ పరిశోధనకు నాయకత్వం వహిస్తోంది. ఈ క్రమంలో మరో నాలుగు నెలల్లో ఐఎన్‌ఎన్‌ఏ-051ను మనుష్యులపై పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎనా రెస్పిరేటరీ ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, రెగ్యులేటరీ అప్రూవల్స్‌కు లోబడే ఈ పరీక్షలు ఉంటాయన్నారు. ఈ నాసల్‌ స్ప్రే అభివృద్ధి కోసం  ఎనా రెస్పిరేటరీ కంపెనీ 11.7 మిలియన్ డాలర్ల నిధుల్ని సమీకరించింది. ఈ నాసల్ స్ర్పే ప్రయోగం, పరిశోధనకు పెట్టుబడి పెట్టినవారిలో ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్రాండన్ క్యాపిటల్ లిమిటెడ్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ గవర్నమెంట్, పెన్షన్ ఫండ్స్ అండ్‌ బయోటెక్ దిగ్గజమైన సీఎస్ఎల్ లిమిటెడ్ ఉన్నాయి. Also read: Naegleria fowleri infection: నల్లా నీళ్లలో మెదడును తినే ప్రాణాంతకమైన సూక్ష్మ జీవి