Afghanistan: అఫ్గాన్‌ తొలి మహిళా గవర్నర్‌ సలీమా మజారీ(Governor Salima Mazari )ని తాలిబన్లు బంధించినట్లు తెలుస్తోంది. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై తాలిబన్లు పైచేయి సాధించినట్లు సమాచారం. కాగా అఫ్గనిస్తాన్‌(Afghanistan)లోని బల్ఖ్‌ ప్రావిన్స్‌(Balkh Province) లోని చహర్‌ కింట్‌ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్‌ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ(Ashraf Ghani) సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్‌ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి నిలిచారు. కానీ.. తాలిబన్లు(Talibans) ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అఫ్గనిస్తాన్‌(Afghanistan) తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్‌(Kabul) వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు.


Also Read:Afghan Crisis: ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న తెలంగాణ వలస కార్మికుల కష్టాలు


'తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల(Islamic act) ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని' తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల(Talibans) రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook