Covaxin Vaccine For Children: అమెరికాలోని పిల్లలకు 'కొవాగ్జిన్‌' టీకా (Covaxin) ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) కోరుతూ అమెరికాలోని భారత్‌ బయోటెక్‌ (Bharat biotech) వ్యాపార భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్‌ ఇంక్‌ దరఖాస్తు (covaxin ocugen) చేసింది. 2- 18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా ఇవ్వటానికి వీలుగా అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి కోరుతూ దరఖాస్తు దాఖలు చేసినట్లు ఆక్యుజెన్‌ ఇంక్‌ తాజాగా వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌లో దాదాపు 526 మంది పిల్లలపై ఈ టీకా (Corona vaccine) ఎలా పనిచేస్తుందనే విషయమై నిర్వహించిన 2-3 దశల క్లినికల్‌ పరీక్షల సమాచారం ఆధారంగా ఈ దరఖాస్తు చేసినట్లు ఆక్యుజెన్‌ ఇంక్‌. పేర్కొంది. దీన్ని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదిస్తే, అమెరికాలో పిల్లలకు అందుబాటులోకి వచ్చిన కొవిడ్‌-19 రెండో టీకా కొవాగ్జిన్‌ అవుతుంది.


'కొవాగ్జిన్‌'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యవసర వినియోగ గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంతో పాటు వివిధ దేశాల్లో 10 కోట్ల డోసులకు పైగా 'కొవాగ్జిన్‌' టీకా ఇచ్చారు.


Also Read: Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది  


Also Read: China Lockdown: 'నిత్యవసరాలు స్టాక్ పెట్టుకోండి' - ప్రజలకు చైనా ప్రభుత్వం హెచ్చరిక  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి