Corona Crisis in China: చైనా కమ్యునిస్ట్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కుటుంబాలన్ని ఎప్పటికప్పుడు సరిపడా నిత్యవసరాలను సమకూర్చుకోవాలని సూచించింది.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ దిశగా (China lockdown Again) అడుగులు వేస్తున్నందునే.. చైనా ఈ ప్రకటన (Corona cases in China) చేసినట్లు తెలుస్తోంది. అయితే చైనా ఈ హెచ్చరికలు చేసేందుకు కారణాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
మళ్లీ లాక్డౌన్ ఎందుకు?
చైనాలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి తోడు డెల్టా వేరియంట్ కేసులు మరింత (China lockdown) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తోంది చైనా.
ఒకటి-రెండు కేసులకే ఆ ప్రాంతమంతా లాకౌడౌన్ విధించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు నగరాల్ల ఇలాంటి చర్యలు చేపట్టింది. సరహద్దులు మూసేయడం, విమానాలను రద్దు చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది చైనా ప్రభుత్వం.
Also read: Tokyo: 'జోకర్' దాడిలో 17 మందికి గాయాలు..అసలేం జరిగిందంటే...
Also read: Viral video: హైవేపై బెడిసికొట్టిన బైకర్ స్టంట్.. చూస్తుండగానే గాల్లోకి ఎగిరి...
కఠిన నిర్ణయాలతోనే కరోనాను కట్టడి చేసిన చైనా..
ప్రపంచవ్యాప్తంగ మొదట చైనాలోనే కరోనా కేసులు వెలుగు చూడగా.. ఇంత వరకు దేశంలో కరోనా కేసులు లక్ష కూడా దాటలేదు. కఠిన నిర్ణయాలు, లౌక్డౌన్లు, మాస్ వ్యాక్సినేషన్(China vaccination news), భారీ స్థాయిలో టెస్టుల వంటి నిర్ణయాలతో ఇతర దేశాలతో పోలిస్తే.. కరోనా కట్టడిలో మెరుగైన ఫలితాలు సాధించింది చైనా.
అయినప్పటికీ కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడం.. ఇటీవల కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తుండటం వంటి కారణాలతో చైనా మళ్లీ కఠినమైన ఆంక్షలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
Also read: China rejects Covid Origins: కొవిడ్ మూలాలపై అమెరికా నివేదిక అంతా తప్పు- చైనా
Also read: Afghan Talibans: మా పాలనను గుర్తించండి అంటున్న తాలిబన్లు
అసలు కారణం కరోనా కాదా?
అయితే చైనా తాజా హెచ్చరికలపై వివిధ కోణాల్లో వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా చైనా ఈ హెచ్చరికలు చేయలేదని కొందరంటున్నారు. గత కొన్నాళ్లుగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార సంక్షోభం తలెత్తే అవకాశాలున్నాయని.. అందుకోసమే చైనా ఇలాంటి ప్రకటన చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also read: Australia Covaxin Approval: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక గుర్తింపు
Also read: White House Press Secretary: అమెరికా వైట్ హౌస్ లో కరోనా కలవరం.. ప్రెస్ సెక్రటరీకి కొవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి