చైనా ( China ) కు బుద్ధి చెప్పడానికి రంగం సిద్ధమవుతోంది. దక్షిణ చైనా ( South china sea ) , ఇండో పసిఫిక్ జలాల్లో ( Indo pacific waters ) చైనా దూకుడుకు సమాధానం చెప్పేందుకు అమెరికా..ఇండియాతో కలిసి పనిచేయనుంది. త్వరలో చర్చలు జరపనున్నామని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తూర్పు లఢాక్ సరిహద్దు ( East ladakh border ) లో ఇండియాలో నెలకొన్న ఘర్షణ..అటు దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ జలాల్లో చైనా వైఖరికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు సమీపిస్తున్నాయి. ఈ రెండు విషయాల్లో చైనాపై ఆగ్రహంగా ఉన్న ఇండియా, అమెరికా ( India and America ) లు కలిసి పనిచేయనున్నాయి. చైనాకు దీటైన సమాధానం చెప్పేందుకు త్వరలో రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా ప్రకటించింది. ఆగ్నేయాసియాలో కీలక దేశమైన భారత్‌కు ఎల్లప్పుడు తమ మద్దతుంటుందని అమెరికా స్పష్టం చేసింది. 2016 నుంచి ఇండియా తమకు మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌గా మారిందని, గత నాలుగేళ్లుగా ఇరుదేశాల రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాల విషయంలో కీలక ముందడుగు పడిందని తెలిపింది. అయితే  సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి  వంటి అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై మాత్రం వచ్చేవారం రెండు దేశాల మధ్య  2 + 2 చర్చలు ( Bilateral meet )  జరుగనున్నాయి. ఇందులో భాగంగా బేసిక్‌ ఎక్స్స్ఛేంజ్‌ అండ్‌ కో - ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ ( బీఈసీఏ )పై భారత్‌ సంతకం చేయనుంది. Also read: Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president Donald Trump )‌ పాలనా యంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు ఆ దేశ మీడియాతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాలయాలు, దక్షిణ చైనా సముద్రం నుంచి ఇండో పసిఫిక్‌ ప్రాంతం వరకూ చైనా దుందుడుకు చర్యలకు బదులిచ్చే క్రమంలో ఒక విధమైన భావజాలం, ఆలోచనలు కలిగిన ఇండియా వంటి భాగస్వామితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు.  మలబార్‌ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాతో జట్టు కట్టనున్నట్లు ఇటీవల భారత్‌ చేసిన ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌కు తమ మద్దతు ఉంటుందని.. సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడితో ముందుకు సాగుతామని ట్రంప్ పాలనాయంత్రాగం స్పష్టం చేసింది.


ఇండియా అమెరికా దేశాల మధ్య వచ్చేవారం జరగనున్న చర్చల్లో భాగంగా,  ఆగ్నేయాసియా ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాల్లో భారత్‌ భాగస్వామ్యం మరింతగా పెరగడాన్ని స్వాగతిస్తున్నామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. లడాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పింది. రెండు దేశాల మధ్య పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్‌ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా,  జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచడం, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో  ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదిరాయి.


శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చేందుకు..వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఎంక్యూ- 9 బి వంటి ఆర్మ్‌డ్‌ ద్రోన్స్ దిగుమతిపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. చర్చలు విజయవంతమైతే..యూఎస్‌ గ్లోబల్‌ జియో- స్పేషియల్‌ మ్యాప్స్ ( US Global Geo Spacial maps ) ఉపయోగించి క్రూయిజ్‌ మిసైల్స్‌, బాలిస్టిక్‌ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలుంటుంది. Also read: US Elections 2020: ట్రంప్‌పై మండిపడ్డ బ‌రాక్ ఒబామా