Pakistan Heavy Rains: అతి తీవ్ర తుపానుగా మారనున్న బిపర్‌జోయ్ ఇంకా తీరం దాటనే లేదు. పొరుగు రాష్ట్రం పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకూ 25 మంది మరణించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించిన ఐఎండీ గుజరాత్‌కు గానీ భారతదేశానికి గానీ ముప్పు ఉండకపోవచ్చని నిర్ధారించింది. అదే సమయంలో మరో 5 రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఈలోగా బిపర్‌జోయ్ తుపాను పొరుగు దేశం పాకిస్తాన్‌ను అల్లకల్లోలం చేస్తోంది. తుపాను ప్రభావంతో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్, పంజాబ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను సృష్టించిన బీభత్సంతో పాకిస్తాన్‌లో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం సంభవించిందని ప్రోవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. ఇప్పటి వరకూ తుపాను కారణంగా పాకిస్తాన్‌లో 25 మంది మరణించగా 140 మంది గాయపడ్డారు. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఖైబర్ పంఖ్తూన్‌లోని బన్ను, డేరా ఇస్మాయిల్ ఖాన్, కరాక్, లకీ మార్వాట్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది.


తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్ పంజాబ్‌లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పాత ఇళ్లు కూలిపోతుండటంతో ఎక్కువ ప్రాణనష్టం కలుగుతోంది. తుపాను బీభత్సంపై స్పందించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తక్షణ చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించారు.  భారీ వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. 


Also read: World Ocean Day 2023: ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ప్రాముఖ్య తెలుసుకోండి!


మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ అతి తీవ్ర తుపాను ముప్పు గుజరాత్‌కు ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఈ తుపాను జూన్ 15 నాటికి పాకిస్తాన్‌ను తాకవచ్చని తెలుస్తోంది. అదే జరిగిందే పాకిస్తాన్‌లో తుపాను తీవ్రత పెను నష్టాన్నే మిగల్చవచ్చు.


Also read: Biperjoy Cyclone Alert: అతి భీకర తుపానుగా మారనున్న బిపర్‌జోయ్, తీరం దాటేది ఎక్కడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook