వాషింగ్టన్‌: కరోనా వైరస్‌కి కులం, మతం, ప్రాంతం, వర్ణం ఏదీ ఉండదనే యావత్ ప్రపంచం భావిస్తోంది.. దానినే నిజమని విశ్వసిస్తోంది. కానీ యూకే, యూఎస్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ శ్వేత జాతీయుల కంటే నల్ల జాతీయులకే కరోనా వైరస్ రిస్క్ అదనంగా  ఉందని యూకే, యూఎస్‌లలో జరిపిన వేర్వేరు అధ్యయనాల్లో తేలింది. కరోనావైరస్ సోకిన బాధితుల్లో శ్వేత జాతీయులతో పోలిస్తే నల్లజాతీయులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్టు వేర్వేరు సంస్థలు జరిపిన సర్వేలు స్పష్టంచేస్తున్నాయని సీఎన్ఎన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఏ ప్రాతిపదికన ఈ అధ్యయనాలు చేపట్టారనే విషయంలో ఇంకా స్పష్టత లభించలేదని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. కాకపోతే వారి సామాజిక-ఆర్థిక అంశాలే ఇందుకు ఓ కారణమని సదరు అధ్యయనాలు అభిప్రాయపడినట్టు ఈ కథనంలో వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : తెలంగాణలో Coronavirus లేటెస్ట్ అప్‌డేట్స్


యూకేలోని బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పాటు భారతీయులపై కూడా కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూకేలో నేషనల్ స్టాటిస్టిక్స్ జరిపిన అధ్యయనం వెల్లడించింది. వయస్సు, ఆరోగ్య సమస్యలు కూడా ఇందుకు మరో కారణమై ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. ఏదేమైనా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంకల్ప బలం ఉంటే కోవిడ్-19 మాత్రమే కాదు.. ఇంకా దేనినైనా జయించొచ్చనేది ప్రపంచం నమ్మే సూత్రం. ఈ సూత్రం ముందు కోవిడ్-19 అయినా తల వంచాల్సిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..