Mission Kabul: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక ఇప్పుడు మిషన్ కాబూల్‌పై అందరి దృష్టి పడింది. మిషన్ కాబూల్ ప్రకారం తరలింపు ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేయలనే విషయంపై స్పష్టత వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)నుంచి అమెరికా నేతృత్వంలోని విదేశీ సైన్యం ఉపసంహరణ ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడమే మిషన్ కాబూల్. విదేశీ సైన్యం తరలింపుతోనే తాలిబన్లు(Talibans) ఆఫ్ఘన్‌ను ఆక్రమించారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం(Kabul Airport) అమెరికా సైన్యం స్వాధీనంలో ఉంది. ఒప్పందం ప్రకారం ఆగస్టు 31లోగా ఆఫ్ఘన్ నుంచి విదేశీ సైన్యాన్ని, పౌరుల్ని, సామగ్రి, యుద్ధ విమానాల్ని తరలించాల్సి ఉంది. ఈ విషయంపై బ్రిటన్ స్పష్టమైన ప్రకటన చేసింది. ఎప్పటిలోగా తరలింపు అనేది కచ్చితమైన టైమ్‌లైన్ ఇవ్వలేమని బ్రిటన్ తెలిపింది. అయితే ఆగస్టు 31 నాటికి కాబూల్ మిషన్ పూర్తి చేస్తామని బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి తెలిపారు.ఈ నెలాఖరు వరకూ తమ సైనిక బలగాల్ని తరలిస్తామన్నారు. దేశ పౌరులు, సామగ్రిని కాబూల్ నుంచి ఉపసంహరించుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఇప్పటి వరకూ 9 వేలమంది బ్రిటీషు పౌరులతో పాటు ప్రమాదంలో ఉన్న ఆఫ్ఘన్‌లను తరలించినట్టుగా బ్రిటన్(Britain)వెల్లడించింది. ఆగస్టు 31 డెడ్‌లైన్ తరువాత ఒక్కరోజు కూడా ఉపేక్షించేది లేదంటూ తాలిబన్లు హెచ్చరించారు. 


Also read: Vaccine Third Dose: కోవిడ్ నియంత్రణకు కరోనా మూడవ డోసు అవసరమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook