Canada Vs Bharat: టెంపుల్ పై దాడి.. కెనడాకు మోడీ సీరియస్ వార్నింగ్..
Canada Vs Bharat: భారత్, కెనడా సంబంధాలు రాను రాను దిగజారుతున్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రధాని అయిన తర్వాత ఈ బంధానికి బీటలు బారడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా కెనడాలో ఉంటూ మన దేశాన్ని ముక్కలు చేస్తానంటున్న ఖలిస్థానీ ఉగ్రవాదులకు బహిరంగ మద్ధతు తెలుపుతూ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. మరోసారి ఆయన అలసత్వం కారణంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై కొంత మంది ఖలీస్థానీ మూకలు దాడులు చేయడం అనేది పీక్స్ అని చెప్పాలి. ఈ ఘటనపై ప్రధాని మోడీ కెనడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
Canada Vs Bharat:కెనడా దేశంలోని బ్రాంప్టన్ లో ఉన్న హిందూ సభా మందిర్‌లోని భక్తులపై ఖలిస్థానీలు దాడి చేశారు. ఈ ఘటనను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలూ అంతే భయంకరమైనవన్నారు. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవన్నారు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది. చట్ట నియమాన్ని సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నాము అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ముఖ్యంగా ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు బీటలు వారాయి. అంతేకాదు అతన్ని భారత దేశ గూఢచారి విభాగమైన రా (RAW)నే మట్టుపెట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా బట్ట కాల్చి మనపై వేసింది. ఈ విషయమై కెనడా మన భారత దౌత్య అధికారులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో మన దేశం కెనడాలోని మన దేశ ప్రతినిధిని వెనక్కి రమ్మని ఆదేశించింది. మరోవైపు కెనడా దేశ ప్రతినిధులు రెండు వారాల్లో మన దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఇక ఆలయ ఘటనపై కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని, ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని తెలిపారు. ఆలయంపై దాడి చేసిన ఘటనపై హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రధాని ట్రుడో ప్రోద్భలం తోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించాయి. ఈ ఘటనపై ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలపై కెనడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆందోళనకారులను వెనక్కి తోసేశారు కెనడా పోలీసులు. దాడి చేసిన ఖలిస్తాన్ వేర్పాటువాదుల మీద చర్యలు తీసుకోకుండా, బాధితుల పైనే కెనడా పోలీసులు దౌర్జన్యం చేయడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మొత్తంగా కెనడా, భారత్ ఇష్యూ ఎంత దూరం వెళతాయేనేది చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.