Water Pollution: ఆ దేశంలో భూగర్భ జలకాలుష్యం పెరిగిపోయింది. తాగునీటిలో ఇంధన ఆయిల్ ఉన్నట్టు ధృవీకరణైంది. సురక్షిత నీరు అందుబాటులో వచ్చేంతవరకూ ఆ నీరు తాగవద్దంటూ అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్తు ఎక్కడ జరిగిందంటే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెనడా(Canada)దేశానికి ఉత్తర ప్రాంతంగా, గ్రీన్‌ల్యాండ్‌కు(Greenland)సరిహద్దుగా ఉన్న నునావుట్ రాజధానికి పెను విపత్తు వచ్చి పడింది. రాజధాని నగరం ఇకాలూయిట్‌లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. ఎంతగా అంటే భూగర్భ జలాల్లో అధిక శాతం ఇంధన ఆయిల్ ఉన్నట్టు తేలింది. ఇకాలూయిట్‌లోని భూగర్భజలాల్లో ఎక్కువ శాతం కిరోసిన్, డీజిల్ ఉన్నట్టు స్వయంగా అధికారులే ప్రకటించారు. నగరంలోని వాటర్ ట్యాంక్ నుంచి సేకరించిన తాగునీటిలో ఇంధన ఆయిల్ నిల్వలు (Fuel in Water)పెద్దమొత్తంలో ఉన్నట్టు నిర్ధారణైంది. దాంతో సురక్షితమైన నీరు అందుబాటులో వచ్చేంతవరకూ ఆ నీరు తాగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


భూగర్భ జలకాలుష్యం(Under ground Water Pollution) కారణంగా ట్యాంక్‌లోని నీటిలో అధికంగా ఇంధనం వాసన వస్తుండవచ్చని ఇకాలూయిట్ అధికారి ఒకరు తెలిపారు. బహుశా ఈ వాసన డీజిల్ లేదా కిరోసిన్‌కు సంబంధించింది కావచ్చని చెప్పారు. సురక్షితమైన నీరు అందుబాటులో వచ్చేంతవరకూ ప్రజలెవరూ ఆ నీటిని వాడవద్దని విజ్ఞప్తి చేశారు. నీటిని కాచినప్పటికీ వాసన పోదని..అందుకే అధికారికంగా చెప్పేంతవరకూ ఆ నీరు ఉపయోగించవద్దని చెబుతున్నారు. ఈ నీటిని వినియోగిస్తే దీర్ఘకాలిక వ్యాదిగ్రస్తులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అక్కడి వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. తాగునీటి సమస్య(Water Pollution) ఓ తీరని సమస్యగా ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. 


Also read: Afghanistan Blast: మసీదులో భారీ పేలుడు.. 16 మంది దుర్మరణం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి