El Salvador Tax: భారత్ సహా ఆఫ్రికా ఇతర దేశాల్నించి అమెరికాకు చేరుకునే చాలామంది పర్యాటకులు సెంట్రల్ అమెరికా మీదుగా వెళ్తుంటారు. ఫలితంగా ఆ దేశంలో వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ చిన్న దేశంలో జనసాంద్రత గణనీయంగా పెరుగుతోంది. అందుకే ఆ దేశం ఇప్పుడు కొత్త నిబంధనలు విధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అ దేశం పేరు ఎల్ సాల్వెడార్. మద్య అమెరికాలోని ఓ చిన్న దేశం. అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతం. ఆఫ్రికా సహా చాలా దేశాల పర్యాటకులు అమెరికాకు చేరాలంటే ఈ దేశం మీదుగా ప్రయాణిస్తున్నారు. కానీ అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఎల్ సాల్వెడార్ దేశంలో భారతీయులకు మాత్రం సవతి ప్రేమ లభిస్తోంది. ఎందుకంటే ఎల్ సాల్వెడార్ చేరుకోగానే ఆ దేశం భారతీయుల్నించి 1000 డాలర్లు ట్యాక్స్ వసూలు చేస్తోంది. అంటే అక్షరాలా 83 వేల రూపాయలు. ఈ ట్యాక్స్ ఇండియాతో పాటు 50 ఆసియా-ఆఫ్రికన్ దేశస్థుల్నించి వసూలు చేస్తున్నారు. 


దక్షిణాన పసిఫిక్ మహా సముద్రం కలిగి నార్త్ వెస్త్‌లో గుటెమోలా దేశం సరిహద్దుగా, నార్త్ ఈస్ట్‌లో హోండురస్ దేశంతో సరిహద్దు కలిగిన ఎల్ సాల్వెడార్ పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ ఆఫ్ ఫోన్సెకాలో ఉంది ఈ దేశం. ఇండియా నుంచి వచ్చే పర్యాటకులు 1000 డాలర్లు రుసుము చెల్లించాలని ఎల్ సాల్వెడార్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. పర్యాటకుల్నించి వసూలు చేసే ఈ డబ్బులతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేస్తామంటోంది పోర్ట్ అధారిటీ.


ఎల్ సాల్వెడార్ దేశంలో ఇప్పుడు వలసలు భారీగా పెరిగిపోతున్నాయనేది ప్రధాన ఆందోళనగా కన్పిస్తోంది. 2023 సంవత్సరంలో అక్రమంగా దేశంలో ప్రవేశించినవాళ్ల సంఖ్య 3.2 మిలియన్లకు పెరిగినట్టు గుర్తించారు. ఆఫ్రికా ఇతర దేశాల్నించి అమెరికాకు వెళ్లేవాళ్లంతా మద్య అమెరికా ద్వారా వెళ్తుండటమే దీనికి కారణం. అందుకే వలసలు ఎల్ సాల్వెడార్ దేశంలో పెరుగుతున్నాయి. అక్టోబర్ నెల నుంచి 1130 డాలర్లు అంటే 94 వేల రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలవుతోంది. ఇండియా సహా 57 దేశాల్నించి వచ్చే ప్రయాణికుల్ని అన్ని విమానయాన సంస్థలు గుర్తించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 


అందుకే మీరు కూడా ఎల్ సాల్వెడార్ వెళ్లే ఆలోచన చేస్తుంటే ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు చెల్లించేలా ప్లాన్ చేసుకోవల్సి ఉంటుంది. అంటే మీ టూర్ బడ్జెట్‌లో లక్ష రూపాయలు అదనంగా చేర్చుకోవల్సిందే.


Also read: Spy Case: ఇజ్రాయిల్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడిన భారతీయులు, మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook