ఔరా..!! తొమ్మిది గంటల్లో రైల్వే స్టేషన్ రెడీ
సాధారణంగా ఎక్కడైనా ఏదైనా కట్టడాన్ని నిర్మించాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది.
సాధారణంగా ఎక్కడైనా ఏదైనా కట్టడాన్ని నిర్మించాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. నిర్మాణాన్ని బట్టి మాసాలు లేదా సంవత్సరాలు పడుతుంది. కానీ కేవలం తొమ్మిది గంటల్లోనే నిర్మాణాన్ని పూర్తిచేసి ఔరా..!! అనిపించారు చైనావాళ్లు.
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ లోని లాంగ్యాన్ నగరంలో నాంగ్లాంగ్ స్టేషన్ ను నిర్మించింది చైనా. శుక్రవారం సాయంత్రం 6:30కు ప్రారంభమైన వీరి ప్రాజెక్ట్ శనివారం తెల్లవారుఝామున 3 గంటలకు పూర్తయింది. ప్రాజెక్ట్ లో భాగంగా వీరు పట్టాలను ఏర్పాటుచేశారు. సిగ్నలింగ్ ను కూడా పునరుద్ధరించారు. "ఈ ప్రాజెక్ట్ కోసం ఏడు రైళ్లను ఉపయోగించాము. మొత్తం 1500 మంది సిబ్బంది ఏడు యూనిట్లలో నిరంతరాయంగా పనిచేశారు" అని చైనా ఇంజనీర్లు పేర్కొన్నారు. చైనాలో మూడు ప్రధాన రైల్వే లైన్లను కలిపేందుకు ఈ రైల్వేలైన్ ఉపయోగపడుతుందని చెప్పారు. రద్దీగా ఉండే గాంగ్లాంగ్ రైల్వే, గాన్రుయిలింగ్ రైల్వే, ఝాంగ్లాం రైల్వేలైన్లను అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే స్టేషన్ ఉపయోగపడుతుందని వివరించారు.
చైనా కొత్తగా 247 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే..! ఈ ప్రాజెక్ట్ కోసం చైనా ఏకంగా 7లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. చైనా హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ను ఈ ఏడాదే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే నాంగ్లాంగ్ రైల్వే స్టేషన్ ను అతిత్వరగా పూర్తిచేశారు.