Omicron Lockdown: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్! ఆసక్తికర విషయం ఏంటంటే?
China locks down Changchun city. కరోనా వైరస్ మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా చాంగ్‌చున్‌లో మరోసారి చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.
China locks down Changchun city amid new Covid 19 cases spike: కరోనా వైరస్ మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. శుక్రవారం (మార్చి 11) 1300లకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు 1000పైనే ఉండటం గత రెండేళ్లలో ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా చాంగ్‌చున్‌లో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే ఇక్కడ కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయినా.. లాక్‌డౌన్ ప్రకటించడం ఆసక్తికర విషయం. వైరస్ వ్యాప్తిని ఆపడానికే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైనాలో మూడు వారాల క్రితం వరకు 100కు తక్కువగా ఉన్న కరోనా కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 1369 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా డజనకు పైగా ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా షాంఘైలో వైరస్ ఉదృతి ఎక్కువగా ఉందట. గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాండాంగ్ ప్రావిన్సులలో కొత్త కేసులు నమోదవుతున్నాయని అక్కడి అధికారులు చెప్పారు. హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో వైరస్ ఉద్ధృతి తక్కువగానే ఉంది. శుక్రవారం 2 కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసులు 78కి చేరాయి. అయినా కూడా అక్కడి అధికారులు శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధించారు. 90 లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో వ్యాపారాలు, విద్యాసంస్థలు అన్ని మూసివేశారు. మరోవైపు రవాణాను కూడా నిలిపివేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాల కోసం ఒక్కరే ప్రత్యేకంగా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. వైరస్ కట్టడిలో భాగంగా నగరమంతా సామూహిక పరీక్షలు చేయనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోన్న చైనా.. ఒక్క కేసు నమోదైనా లక్షల కొద్దీ పరీక్షలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వెయ్యికి పైగా కేసులు బయటపడటంతో.. టెస్టులను మరింత వేగవంతం చేసింది. షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలను లాక్ చేసి విద్యార్థులు, టీచర్లను బందీలుగా ఉంచి పరీక్షలు చేస్తోన్నట్లు సమాచారం తెలుస్తోంది. టెస్టులు పూర్తయ్యేవరకు వీరంతా అక్కడే ఉండనున్నారట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook