Petrol Price hits 254 per litre in Sri Lanka: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాంతో చాలా దేశాల్లో చముర ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. శ్రీలంకలో అయితే పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీ దాటి.. హాఫ్ సెంచరీ కూడా కొట్టింది. ఇప్పటికే ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న లంకపై ఇది మరో పిడుగు అనే చెప్పాలి.
తాజాగా శ్రీలంకలో లీటర్ డీజిల్‌పై 75 రూపాయలు, లీటర్ పెట్రోల్‌పై 50 రూపాయలు చొప్పున పెరిగాయి. ముడిచమురు ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ) శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఫలితంగా లంకలో పెట్రోల్ లీటర్ ధర 254 రూపాయలకు చేరగా.. డీజిల్ ధర 214 రూపాయలకు ఎగబాకింది. శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలు భారీగా పెరగడం ఇది మూడోసారి.
అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం అక్కడి ప్రజలకు పెను భారంగా మారింది. సాధారణ ప్రజలు వాహనాలను బయటికి తీయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని లంక పౌరులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దేశీయ విద్యుత్ సంస్థ టర్బైన్‌లను నడపేందుకు ఇంధనం లేక భారీగా విద్యుత్ కోతలు కూడా శ్రీలంక సర్కారు విదిస్తోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. ఇది చమురు, గ్యాస్ ధరల పెరుగుదలకు ఓ కారణమైంది. దీంతో పాటు శ్రీలంక రూపాయి భారీగా పతనం కావడం ఇంధన ధరలు పెంపునకు మరో కారణం. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై 57 రూపాయలకు తగ్గింది. ఏడు రోజుల్లో ఇలా శ్రీలంక రూపాయి విలువ తగ్గడం ఇది రెండోసారి. ఇది చమురు, గ్యాస్ ఉత్పత్తుల ధరలను నేరుగా ప్రభావితం చేసింది.
Also Read: Crime News: థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయ్యారం ఎస్సై రమాదేవి.. నడవలేని స్థితిలో నిందితుడు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook