China locks down in three cities, raising affected to 20 million, people to quarantine in tiny metal boxes : చైనాలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్కడ కరోనా విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో చైనాలో (China) ఇప్పటికే మూడు న‌గ‌రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దాదాపు 20 మిలియ‌న్లకు (20 million people) పైగా ప్ర‌జ‌ల్ని ఇంటికే ప‌రిమితం చేసింది చైనా ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ బారిన పడిన వారి కోసం చైనా ప్ర‌భుత్వం ప్రత్యేకంగా క్వారంటైన్‌ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం చాలా మెటల్ బాక్స్‌లు (metal boxes) ఏర్పాటు చేసింది. సాధార‌ణంగా హాస్పిటల్స్‌లో ఉండే విధంగానే ఈ మెటల్ క్యాబిన్స్‌లలో (Metal cabins) కూడా బెడ్స్ (Beds) ఉంటాయి. ఒక్కో పేషేంట్‌ను ఉంచేందుకు ఒక్కో మెటల్ క్యాబిన్‌ను ఏర్పాటు చేసింది చైనా ప్రభుత్వం. (China Government) 


ఈ మెటల్ క్యాబిన్‌లో ఉడెన్ బెడ్‌, టాయిలెట్ తదితర సౌక‌ర్యాలు ఉంటాయి. కోవిడ్ పాజిటివ్‌ (Covid Positive‌) వచ్చిన వ్యక్తికి నెగెటివ్‌గా తేలేంతే వరకు ఆ క్యాబిన్‌లోనే ఉంచుతారు. ఇక చిన్న‌పిల్లలు కోవిడ్ బారినపడ్డా కూడా ఈ క్యాబిన్స్‌లలోనే క్వారంటైన్‌లో ఉండాలి. 


Also Read : Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- వివరాలు ఇవే..


అయితే కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్‌లో (Quarantine‌) ఉంటే, వైరస్‌ ఇత‌ర‌ల‌కు స్ప్రెడ్ అవుతుందనే కారణంతో చైనా ఇలా ప్రత్యేక క్వారంటైన్‌ ఏర్పాట్లు చేసింది. కోవిడ్ బారినపడిన ప్రతి ఒక్కరూ.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండడాన్ని తప్పనిసరి చేసింది. ఇక చైనా (China) జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే దేశంలోని అతిపెద్ద నగరాలైన షియాన్‌, టియాంజిన్‌లతో పాటు అన్యాంగ్‌ నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది.


Also Read : తెలంగాణ రైతులు సంబరపడే న్యూస్.. ప్రతీ నెలా ఫించన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ సర్కార్?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook