China Lockdown: చైనాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లాక్‌డౌన్‌లోకి మ‌రో న‌గ‌రం..

China Lockdown: చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని మరో నగరం లాక్ డౌన్ ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 12:49 PM IST
China Lockdown: చైనాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లాక్‌డౌన్‌లోకి మ‌రో న‌గ‌రం..

China Lockdown: ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేటట్టుగా తయారైంది చైనా పరిస్థితి. 2019 డిసెంబ‌ర్‌లో చైనాలోని వుహాన్ లో తొలిసారి క‌రోనా వైరస్ (COVID-19) వెలుగుచూసింది. వుహాన్ లోని ల్యాబ్ నుంచి కరోనా వైరస్ బయటకు వచ్చిందని పలు దేశాలు ఆరోపించాయి. అమెరికా ఒక అడుగు ముందుకేసి...అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంఫ్ ఉన్న కాలంలో ఆ వైరస్ కు 'చైనా వైరస్' అని పేరు పెట్టింది.  ఎవరు ఎన్నీ ఆరోపణలు చేసిన ఆ విషయాన్ని చైనా (China) ఒప్పుకోవడం లేదు. జంతువుల నుంచి మ‌నిషికి సోకింద‌ని చెబుతూ వ‌చ్చింది. క‌రోనా పుట్టుక‌కు కార‌ణం ఎంటి అన్నది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ స్ప‌ష్టంగా చెప్పలేకపోయారు. 

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. డెల్టా, డెల్లా ఫ్లస్, ఒమిక్రాన్..ఇలా రకరకాల కరోనా కొత్త వేరియంట్లు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ (Omicron Variant)తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి.  అమెరికాలో రోజుకు మిలియన్ కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు చైనాలో కూడా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇప్పటికే  జియాంగ్‌, యోంగ్జూ న‌గ‌రాల్లో లాక్ డౌన్ (Lock Down) విధించి..కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ.

Also Read: Omicron Effect: రానున్న రోజుల్లో బలోపేతం కానున్న ఒమిక్రాన్ వేరియంట్, తీవ్ర పరిణామాలే

కాగా.. సోమవారం యాన్యాంగ్ (Anyang) న‌గ‌రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో ఆ న‌గ‌రంలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  5.5 మిలియ‌న్ జ‌నాభా క‌లిగిన యాన్యాంగ్ న‌గ‌రంలోని ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అక్కడి ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రెండు కేసులు బ‌య‌ట‌ప‌డిన వెంట‌నే లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి బీజింగ్ లో వింట‌ర్ ఒలింపిక్స్ (Winter Olympics 2022) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. జీరో వైర‌స్ కంట్రీగా చైనాను తీసుకొచ్చేందుకు అక్కడి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News