డ్రగ్స్ కేసులో ( Drugs  Case ) అరెస్టు అయిన జైలులో శిక్షను అనుభవిస్తున్న చైనాకు ( China ) చెందిన ఒక స్మగ్లర్ వంద అడుగుల సొరంగం తవ్వి ఇండోనేషియా జైలు నుంచి పరారయ్యాడు. అయితే ఇది ఇటీవలే జరిగిన ఘటన కాదు. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నాటిది. 2016లో కాయ్ జీ ఫేన్ అనే వ్యక్తి పోలీసు కస్టడీలో ఉండగా బాత్రూమ్ లో నుంచి సొరంగం తవ్వి జైలు నుంచి తప్పించుకున్నాడు. అయితే అలా తప్పించుకున్న మూడు రోజులకే అతను మళ్లీ ఈస్ట్ జావా ప్రాంతంలోనే అరెస్ట్ అయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి


ఇండోనేషియాలో భారీ ఎత్తును మత్తు పదార్థాలు సప్లై చేయడంతో అక్కడి ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ డ్రగ్ ట్రాఫికర్ గా అతడిని ప్రకటించింది. అతడిని పలు సార్లు అరెస్ట్ కూడా చేసింది. అయితే అతను గొయ్యి తవ్వి తప్పింకుకోవడం అనేది అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా జైలు ( Jail ) నుంచి అతను తప్పించుకోవడం ఇది రెండో సారి. దీంతో జకార్తాలోని టాంగేరాంగ్ జైలు అధికారులు కాయిజీ ఫేన్ చైనాలో చేసిన నేరాల చరిత్ర తెలుసుకుంటున్నారు.



ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి


2016 లో కాయ్ జీ ఫేన్ డ్రగ్స్ ను సప్లై చేస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడికి కోర్టు మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి అతన్ని జకార్తా (Jakarta ) జైలులోనే ఉంచారు పోలీసులు. అక్కడి నుంచి 100 అడుగుల సొరంగం తవ్వి అతను తప్పించుకున్నాడు. ఈ సొరంగం తిన్నగా మురికి కాలువకు కనెక్ట్ అవడంతో అతను తప్పించుకోవడం సాధ్యం అయింది.



ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ మసాలా ఎందుకు అయిందో తెలుసా ? 


మొదటి సారి అతను సొరంగం తవ్వి ఒంటరిగా తప్పించుకున్నాడు అని... కానీ రెండోసారి మాత్రం అతను మరికొంత మందిని తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ వారు నిరాకరించడంతో మళ్లీ ఒక్కడే తప్పించుకోవడం కోసం సొరంగ మార్గాన బయటికి వచ్చాడు. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR