వైరస్ గుప్పిట్లో ప్రపంచం.. 16వేలు దాటిన కరోనా మరణాలు
కరోనా వైరస్ మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా ఇటలీలో కరోనా మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) కోరలు చాస్తోంది. వైరస్ ప్రభావంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 16,508కి చేరుకుంది. మొత్తం 168 దేశాల్లో 3,78,679 కోవిడ్19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ బారిన పడి దేశంలో 9మంది చనిపోగా, 471 పాజిటీవ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మనసున్న మారాజు.. ప్రకాష్ రాజ్
కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయాలో, మరణాల్ని ఎలా ఆపాలో అర్థంకాక వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు యూరప్‌తో పాటు అమెరికాలోనూ భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలోనూ కరోనా కాటు మరణాల సంఖ్య 553కి చేరుకోవడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos
సోమవారం ఒక్కరోజే 140 మంది ప్రాణాలు కోల్పోగా, 10,168 కోవిడ్19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాలోనే కరోనా బాధితుల సంఖ్య 43,734కు చేరింది. పలు దేశాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బుల్లితెర భామ టాప్ Bikini Photos