'కరోనా వైరస్'.. అతి  వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటికే అన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 5 లక్షల 97 వేల 185   పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అతి త్వరలోనే ఆరు లక్షలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు 27 వేల 359 మంది ప్రాణాలు విడిచారు. చైనా తర్వాత ఇటలీపై ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం చూపించింది.


బీహార్‌లో బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ..!!


ఐతే తాజాగా ఈ రికార్డును అమెరికా దాటేసింది.  అమెరికాలో ఇప్పటి వరకు లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మొత్తంగా అమెరికాలో లక్షా 4 వేల 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇండియాలోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో 873 మంది కరోనా బారిన పడ్డారు. 19 మంది చనిపోయారు. మొత్తంగా 79 మంది కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. 


ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఏడుగురు వ్యక్తులకు పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ముగ్గురు వేరే ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కర్ణాటకలో నేటి వరకు 74 మంది కరోనా పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు కర్ణాటకలో ముగ్గురు మృతి చెందారు. అటు కరోనా వైరస్ పాజిటివ్ కేసు భారత్ లోనే మొట్టమొదటి సారిగా కేరళలో నమోదైంది. కానీ ఈ రోజు తొలి మృతి రికార్డైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..