Coronavirus spread: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ గాలి ద్వారానే వేగంగా విస్తరిస్తోందని మరోసారి నిరూపితమైంది. వస్తువుల్ని ముట్టుకోవడం కంటే..వైరస్ ఉన్న గాలిని పీల్చడం ద్వారానే వేగంగా విస్తరిస్తోందని తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన వివరాల ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ (Coronavirus)మహమమ్మారి గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తోందని తేలిపోయింది. వస్తువుల్ని ముట్టుకోవడం కంటే వైరస్ నిండి ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్, కెనడా, అమెరికా సైంటిస్టులు సంయుక్తంగా చేసిన అధ్యయనం వివరాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ( The Lancet Medical journal) ‌లో ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్‌ను ఎయిర్ బోర్న్ ( Coronavirus is Airborn) ‌గా ప్రకటించాలంటున్నారు సైంటిస్టులు. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి ( Corona spread throug Air) ఎక్కువగా ఉందనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయంటున్నారు. 


తక్షణం అంటే యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), ఇతర దేశాలకు ఈ సైంటిస్టులు సూచించారు. రీసెర్చ్ లో భాగంగా  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ(Oxford University) కి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించిన పలు జర్నల్స్‌ను సమీక్షించారు. గాలి ద్వారానే కోవిడ్ అధిక మొత్తంలో వ్యాప్తి చెందుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.


మనుషుల ప్రవర్తన, ఇంటరాక్షన్, గది సైజు వెంటిలేషన్ వంటి అంశాలు వైరస్‌ వ్యాప్తిలో కీలకంగా ఉన్నాయి. మనుషులు ఒకరినొకరు కలుసుకోకుండా క్వారంటైన్‌ ( Quarantine) లో ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎవరైతే దగ్గకుండా, తుమ్మకుండా ఉన్నారో వాళ్ళలో కూడా ఎటువంటి లక్షణాలు లేకపోయినా, 33 నుంచి 59 శాతం ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఈ వైరస్ గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుందనడానికి ఇదొక కారణమంటున్నారు. బయట కంటే కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. కరోనా రాకుండా ఉండడానికి చాలా చోట్ల పీపీఈ కిట్స్‌ని ధరించారు. అలా ధరించిన ప్రదేశాలలో కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి. నిపుణులు కనుగొన్న దాని ప్రకారం గాలిలో మూడు గంటల పాటు ఈ వైరస్ ఉంటుంది.పెంపుడు జంతువుల ఆవాసాల్లో కూడా కరోనా వైరస్ గుర్తించారు. ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ కాదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు.


Also read: Covid Vaccination: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ నిలిపివేసిన డెన్మార్క్ దేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook