కరోనా వైరస్ మహమ్మారి బారిన ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ ఘేబ్రియస్ పలు దేశాలను కరోనా గురించి హెచ్చరించారు. కరోనా ఇప్పట్లో తగ్గేది కాదని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాలను బుధవారం ఆయన హెచ్చరించారు.  కరోనా కేసులే లేని దేశాలివే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా, ఆఫ్రికా దేశాలలో ఓవైపు కరోనా కేసులతో పాటు మరణాలు భారీగా సంభవిస్తున్నాయని, అదే సమయంలో కొన్ని దేశాలు తాము కరోనా వైరస్‌పై విజయం సాధించి సురక్షితంగా ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణ, సెంట్రల్ అమెరికా, తూర్పూ యూరప్ దేశాలు ఇప్పటికి కరోనా ప్రారంభదశలోనే ఉన్నాయి. త్వరగా దీనిపై జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!


పరిస్థితి ముందుగానే ఊహించి తాము జనవరి 30న సరైర సమయంలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఘెబ్రియాస్ గుర్తుచేశారు. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నిధుల నిలిపివేతపై సైతం ఆయన స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, అమెరికా ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.  హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  


ఏప్రిల్ 22 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 26 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి 1.81 లక్షల మందిని బలి తీసుకుంది. 26,03,147 మందికి కరోనా సోకగా, ఇప్పటివరకూ 1,81.235 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలో 8,34,858 పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాదాపు 45వేల మంది మరణించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos